NTV Telugu Site icon

Exclusive : ‘హరిహర వీరమల్లు’ అసలే బజ్ లేదు.. పైగా పోస్ట్ పోన్..

Hhvm

Hhvm

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలలో హరిహర వీరమల్లు ఒకటి. చాలా ఏళ్ల క్రితం మొదలైన ఈ సినిమా షూటింగ్ ఏళ్లకి ఏళ్ళుగా జరుగుతూనే ఉంది. ఇప్పటికే ఈ సినిమాను మొదలు పెట్టిన దర్శకుడు క్రిష్ జాగర్లమూడి సగభాగం దర్శకత్వం వహించి తప్పుకున్నాడు. మిగిలిన పోర్షన్ కు నిర్మాత ఏ ఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై పీరియాడిక్ సినిమాగా తెరెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి, పోస్టర్స్, సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. కానీ ఎందుకనో ఈ సినిమాను ముందు నుండి అనుకున్న బజ్ రావడం లేదు.

స్వయంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో పాడిన పాట కూడా అంతగా వైరల్ అవలేదు. ఫ్యాన్స్ కూడా OG మాయలో ఉన్నారు తప్ప ఈ సినిమాను వారు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. అటు బయ్యర్స్ సర్కిల్స్ లో కూడా ఈ సినిమా కోసం ఎగబడేంత ఉత్సహం లేదు. అయితే  ఈ  సినిమాను మార్చి 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ఇదివరకే ప్రకటించారు మేకర్స్. కానీ ఇప్పుడు ఆ డేట్ కు దాదాపు రావట్లేదు. ఇప్పటికి పవన్ కళ్యాణ్ కు సంబంధించి కొంత మేర షూట్ పెండింగ్ ఉంది. మరికొద్దీ రోజుల్లో పవన్ షూట్ లో జయిన్ అవుతారు. ఈ పోర్షన్ షూట్ ఫినిష్ అయ్యేందుకు ఎలా చూసుకున్న కూడా నెల రోజులు పడుతుంది. ఆపై పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫినిష్  చేసేందుకు మరో నెల. సో మే నెలాఖరు అలాగా హరిహర వీరమల్లు థియేటర్స్ లో అడుగుపెడుతుంది. ఈ ఆస్కార్ విన్నర్  ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుస్తుండగా సూర్య మూవీస్ బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. పవన్ సరసన అందాల భామ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.