Site icon NTV Telugu

HHVM : హరిహర వీరమల్లు ఏరియాల వారి థియేట్రికల్ రైట్స్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే.?

Hhvm (4)

Hhvm (4)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’  మొత్తానికి అన్ని అడ్డంకులు దాటి మరికొన్ని గంటల్లో థియేటర్స్ లో అడుగుపెడుతున్నాడు. నాలుగేళ్లుగా షూటింగ్ చేసుకున్న ఈ సినిమాను ఎ.ఎం. రత్నం నిర్మించగా ఆయన కుమారుడు ఎ.ఎం. జ్యోతి కృష్ణ మరియు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో క్రేజ్ హై లెవల్ లో ఉండడంతో బయ్యర్స్ కూడా భారీ ధరకు హరిహర రైట్స్ దక్కించుకున్నారు.

ఇక వరల్డ్ వైడ్ గా హరిహర వీరమల్లు ఎంత ధరకు కొనుగోలు చేసారు, ఆంధ్ర నైజాం ఏరియాల వారీగా ఎంత ధర పలికిందో వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ – 
ఉత్తరాంధ్ర – రూ. 12 కోట్లు
తూర్పు గోదావరి – రూ. 9.50 కోట్లు
పశ్చిమ గోదావరి – రూ. 7 కోట్లు
కృష్ణ – 7. 60 కోట్లు
గుంటూరు – రూ. 9.50 కోట్లు
నెల్లూరు – 4.40 కోట్లు
రాయలసీమ – రూ. 16 కోట్లు

నైజాం – రూ. 37 కోట్లు

ఆంధ్ర + నైజాం మొత్తం కలిపి = రూ. 103కోట్లు 

ఓవర్సిస్ – రూ. 10 కోట్లు

కర్ణాకట + రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ. 12.50 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ – రూ. 126 కోట్లకు హరిహర విరమల్లు థియేటర్స్ రైట్స్ డీల్స్ క్లోజ్ అయ్యాయి. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 210 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు ఉన్న బజ్ చూస్తుంటే ఇది సింపుల్ టార్గెట్ లానే ఉంది. కేవలం ప్రీమియర్స్ తోనే రూ. 40 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉంది.

Exit mobile version