NTV Telugu Site icon

HHVM : హరి హర వీరమల్లు ఫస్ట్ సింగిల్ ‘మాట వినాలి’ రిలీజ్

Pavan Kalyan

Pavan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు.  ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న   ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నస్వయంగా పవన్ కళ్యాణ్ పాడిన ‘మాట వినాలి’ అంటూ సాగే  ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసారు మేకర్స్.  “వినాలి.. వీరమల్లు మాట చెప్తే వినాలి” అంటూ తెలంగాణ మాండలికంలో పవన్ కళ్యాణ్‌ చెప్పే హృద్యమైన పంక్తులతో పాట ప్రారంభమైన తీరు అమోఘం. పెంచల్ దాస్ అందించిన సాహిత్యం లోతైన భావాన్ని కలిగి ఉంది.

అటవీ నేపథ్యంలో చిత్రీకరించిన ‘మాట వినాలి’ పాట విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ గ్రేస్ ఫుల్ డ్యాన్స్ లు పాట విడుదలైన కొద్ది నిమిషాల్లోనే సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారాయి. ఎం.ఎం. కీరవాణి అందించిన సంగీతం వినసొంపుగా ఉంది. ఇక పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన గాత్రంతో మొదటి నుండి చివరి వరకు శ్రోతలను కట్టిపడేసేలా చేశారు. ‘హరి హర వీరమల్లు’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో అలరించనుంది. హరి హర వీరమల్లు చిత్రం 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో భారీ బడ్జెట్ తో పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్, నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి వంటి ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అణగారిన వర్గాల కోసం అన్యాయంపై పోరాడే యోధుడు కథగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. హరి హర వీరమల్లు చిత్రీకరణ తుది దశలో ఉంది. నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా చురుకుగా సాగుతున్నాయి. ఈ చిత్రాన్ని 2025, మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Also Read : GameChanger : గేమ్ ఛేంజర్ పైరసీ.. నిందితుల అరెస్ట్..