క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా “హరి హర వీర మల్లు” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ మొదటి వారంలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ముందుగా “భీమ్లా నాయక్”ను పూర్తి చేయాలని భావించిన పవన్ కళ్యాణ్ “హరి హర వీర మల్లు”ను కొంత వరకు షూటింగ్ జరిగిన తరువాత కొన్ని రోజులు పక్కన పెట్టేశారు. పైగా కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక “భీమ్లా నాయక్”ను శరవేగంగా పూర్తి చేసి, బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న పవన్ ఇప్పుడు అదే జోష్ తో “హరి హర వీర మల్లు” మిగతా షూటింగ్ ను పూర్తి చేయబోతున్నాడు.
Read Also : Raashii Khanna : సౌత్ పై షాకింగ్ కామెంట్స్… క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఈరోజు హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ప్రారంభమైంది. ఈ నెల 8 నుంచి పవన్ షూట్ లో జాయిన్ అవుతాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. “హరిహర వీర మల్లు” చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యాక పవన్ కళ్యాణ్ “వినోదయ సీతం” తెలుగు రీమేక్ పై దృష్టి పెట్టనున్నారు.
