దేశవ్యాప్తంగా ఉన్న సెలెబ్రటీలందరికీ ‘పుష్ప’ ఫీవర్ పట్టుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి కొత్తగా నియమితులైన హార్దిక్ పాండ్యా ‘పుష్ప’ సాంగ్ కు స్టెప్పులేశారు. అల్లు అర్జున్ ‘పుష్ప’లోని ‘శ్రీవల్లి’ పాటకు హార్దిక్ పాండ్యా తన అమ్మమ్మతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేశారు. తమ టెర్రస్‌పై సరదాగా గడిపిన వీరిద్దరూ అల్లు అర్జున్ ‘శ్రీవల్లి’ సిగ్నేచర్ స్టెప్‌ను రీక్రియేట్ చేశారు. హార్దిక్ పాండ్యా అమ్మమ్మ ఈ స్టెప్పునేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Read Also : ఓటిటిలో ‘రాధేశ్యామ్’… అసలు విషయం వెల్లడించిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్
హార్దిక్ అల్లు అర్జున్‌ని ట్యాగ్ చేస్తూ “మా స్వంత పుష్ప నాని” అంటూ ఈ అందమైన వీడియోకు క్యాప్షన్ కూడా ఇచ్చాడు. అల్లు అర్జున్ ‘పుష్ప: ది రైజ్’ సృష్టించిన ఫీవర్ దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యక్తులను కూడా ఆకట్టుకుంది అనడంలో సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు ‘పుష్ప’ ప్రపంచంలోకి చేరి వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. మంగళవారం ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ‘పుష్ప’ స్టెప్పులతో రెండు వీడియోలను పోస్ట్ చేశాడు. వార్నర్ ‘పుష్ప: ది రైజ్’లోని కొన్ని ఐకానిక్ సన్నివేశాలలో అల్లు అర్జున్ కు బదులుగా తన రూపాన్ని ఎడిట్ చేసిన సరదా వీడియోను కూడా పోస్ట్ చేశాడు.
