Site icon NTV Telugu

ఐదు భాషల్లో హర్బజన్ – అర్జున్ ‘ఫ్రెండ్ షిప్‌’

ఇండియ‌న్ మాజీ క్రికెట‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్‌, యాక్ష‌న్ కింగ్ అర్జున్ హీరోలుగా న‌టించిన చిత్రం ‘ఫ్రెండ్ షిప్‌’. జాన్ పాల్ రాజ్‌, శామ్‌ సూర్య దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏకకాలంలో భారీ ఎత్తున సినిమాను విడుదల చేయ‌డానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్నితెలుగులో శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత ఎ. ఎన్ బాలాజీ విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ ”సెకండ్ వేవ్ త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కులు సినిమాల‌ను గొప్ప‌గా ఆద‌రిస్తున్నారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మా ఒరేయ్ బామ్మ‌ర్ది చిత్రం. రీసెంట్‌గా థియేట‌ర్స్‌లో విడులైన ఈ సినిమాకు ప్రేక్షకులనుంచి మంచి స్పందన వచ్చింది. దాంతో మా తదుపరి చిత్రం ‘ఫ్రెండ్ షిప్‌’ను సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. దాదాపు పాతిక కోట్ల రూపాయ‌ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా త‌ప్ప‌కుండా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది” అని అన్నారు.

మ‌లయాళంలో అంద‌రూ కొత్త న‌టీన‌టుల‌తో తీసిన సూప‌ర్ హిట్ మూవీ ‘క్వీన్’ రీమేక్ రైట్స్ తీసుకుని ‘ఫ్రెండ్ షిప్‌’ను నిర్మించారు. కాలేజ్ స్టూడెంట్స్ కు, రాజకీయ నేతలకు మ‌ధ్య ఏం జ‌రిగింద‌నే విషయాన్ని ఆస‌క్తిక‌రంగా, క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో ఎంగేజింగ్‌గా ద‌ర్శ‌కుడు జాన్ పాల్ రాజ్‌, శామ్‌ సూర్య‌ తెర‌కెక్కించారని నిర్మాత బాలాజీ తెలిపారు. ఇందులో ఐదు ఫైట్స్‌, నాలుగు పాట‌లుంటాయని, సెన్సార్ తో సహా అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సెప్టెంబ‌ర్‌లో సినిమాను విడుదల చేస్తామని ఆయన చెప్పారు.

Exit mobile version