HBD Simran : చిందులతో సిరులు కురిపించిన సిమ్రాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(ఏప్రిల్ 4న అందాలనటి సిమ్రాన్ పుట్టినరోజు)
ఇప్పుడంటే అమ్మ పాత్రలు, అత్త పాత్రలు చేస్తున్నారు కానీ, ఒకప్పుడు సిమ్రాన్ అందం జనానికి కనువిందుచేసి చిందులు వేయించింది. నాటి కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది. ఈ నాటికీ నాటి అభిమానుల మదిలో శృంగారదేవతగా తిష్టవేసుకొనే ఉంది సిమ్రాన్. ఉత్తరాదిన ఉదయించిన ఈ భామ దక్షిణాది చిత్రాలతోనే ఓ వెలుగు వెలిగింది. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో సిమ్రాన్ చూసిన విజయం అంతా ఇంతా కాదు. సిమ్రాన్ నాయికగా రూపొందిన పలు చిత్రాలు వసూళ్ళ వర్షం కురిపించాయి. హీరోయిన్ గా ఫేడవుట్ కాగానే తెలివిగా పెళ్ళి చేసుకొని సంసారపక్షంగా ఉన్న సిమ్రాన్ ను మళ్ళీ సినిమాలు పిలుస్తున్నాయి. తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు సిమ్రాన్.
సిమ్రాన్ 1976 ఏప్రిల్ 4న ముంబైలో జన్మించారు. ఆమె అసలు పేరు రిషిబాల నావల్. చదువుకొనే రోజుల్లోనే డాన్సుల్లోనూ, యాక్టింగ్ లోనూ చురుకుగా ఉండేది. కాలేజీ డ్రామాలలోనూ, డ్రెస్ కాంపిటీషన్స్ లోనూ సిమ్రాన్ చిన్నప్పుడే చిందులు వేశారు. టీనేజ్ లోనే సిమ్రాన్ సినిమా రంగంలో అడుగు పెట్టింది. ‘సనమ్ హర్ జై’ హిందీ చిత్రంలో తొలిసారి నటించిన సిమ్రాన్ అప్పటి నుంచీ బ్రేక్ కోసం ఉత్తరాది నుండి దక్షిణాదికి, ఇటు నుంచి అటు పరుగులు తీసింది. దక్షిణాది చిత్రాలే ఆమెకు మంచి గుర్తింపును ప్రసాదించాయి. తెలుగులో సుమన్ హీరోగా రూపొందిన ‘అబ్బాయిగారి పెళ్ళి’తో తొలిసారి మన జనం ముందు నిలచింది. ఆ సినిమాలోనే సిమ్రాన్ అందం అయస్కాంతంలా యువకులను ఆకర్షించింది. ఆమెను స్టార్ హీరోయిన్ గా నిలిపిన చిత్రం బాలకృష్ణ హీరోగా నటించిన ‘సమరసింహారెడ్డి’. ఈ చిత్ర ఘనవిజయంతో సిమ్రాన్ కాల్ షీట్స్ కు క్రేజ్ ఏర్పడింది. తరువాత చిరంజీవితో ‘అన్నయ్య’లో ఒక్కపాటలోనే చిందేసి కనువిందు చేసినందుకే అప్పట్లో భారీ పారితోషికం పుచ్చుకున్నారామె. ఆపై వెంకటేశ్ ‘కలిసుందాం రా’లో ముద్దు ముద్దుగా మురిపించారు. నాగార్జున కెరీర్ లో బిగ్ హిట్ గా నిలచిన ‘నువ్వు వస్తావని’లోనూ సిమ్రాన్ నాయికగా ఆకట్టుకున్నారు. ఇలా టాలీవుడ్ టాప్ హీరోస్ తో వరుసగా బిగ్ హిట్స్ చూడటంతో సిమ్రాన్ పేరు తెలుగునాట మారుమోగిపోయింది. సిమ్రాన్ ఉంటే చాలు ఆమె అందాల అభినయాన్ని చూసేందుకు జనం పరుగులు తీసేవారు. మరోమారు బాలకృష్ణతో ‘నరసింహనాయుడు’లో నటించిన సిమ్రాన్ కు మరో భారీ విజయం దక్కడమే కాదు, నటిగానూ మంచి మార్కులు పడ్డాయి. బాలకృష్ణతో “గొప్పింటి అల్లుడు, సీమసింహం, ఒక్క మగాడు” వంటి చిత్రాలలోనూ మురిపించారు. ఇక చిరంజీవితో “మృగరాజు, డాడీ” సినిమాల్లో నటించారు. నాగార్జునతో ‘బావనచ్చాడు’లోనూ, వెంకటేశ్ తో ‘ప్రేమతో రా’లోనూ నటించి ఆకట్టుకున్నారామె. హరికృష్ణతో సిమ్రాన్ నటించిన ‘సీతయ్య’లోనూ అమ్మడు అందంతో అదరహో అనిపించింది. మహేశ్ బాబుతో ‘యువరాజు’లోనూ అలరించారు. ఇలా టాప్ స్టార్స్ తో టాలీవుడ్ లో భమ్ చిక భమ్ ఆడించారు. ఆమె నటించిన పలు చిత్రాలు నిర్మాతలకు సిరులు కురిపించాయనే చెప్పాలి.
Also Read
- Ajay Bhupathi: మహేష్ బాబు అలా అడుగుతారని అస్సలు ఊహించలేదు.. 'RX100' తర్వాత ఏం జరిగిందో చెప్పిన అజయ్ భూపతి!
- Ajay Bhupathi: ఆర్జీవీ మేకింగ్ స్టైల్‌కు ప్రత్యేక బ్రాండ్ ఉంది
- Ajay Bhupathi: 'మంగళవారం'లో హీరోయిన్ పాయల్ రాజ్‌ఫుత్ క్యారెక్టర్‌పై డైరెక్టర్ అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్..
- Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ 'ఫౌజీ' vs షారుఖ్ 'కింగ్'.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
సిమ్రాన్ తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో నటించి మురిపించారు. తరువాత పెళ్ళి చేసుకొని కొంతకాలం సినిమాలకు దూరంగా జరిగారు. 2008లో బుల్లితెరపై కనిపించి కనువిందు చేశారు. జయ టీవీలో ప్రసారమైన ‘సిమ్రాన్ దిరై’ సీరియల్ తో భలేగా ఆకట్టుకున్నారామె. ఆ తరువాత తెలుగులో ‘జాన్ అప్పారావ్ 40 ప్లస్’లో కృష్ణ భగవాన్ సరసన సైతం మురిపించారు సిమ్రాన్. తమిళంలో ఆమెకు మంచి అవకాశాలే వస్తున్నాయి. రజనీకాంత్ ‘పేట్ట’లో తొలిసారి ఆయన సరసన నటించారు సిమ్రాన్. ఈ మధ్యే వచ్చిన విక్రమ్ ‘మహాన్’లో ఆయనకు జోడీగా కనిపించారు సిమ్రాన్. తమిళంలో “రాకెట్రీ:ద నంబీ ఎఫెక్ట్, అంధగాన్, కెప్టెన్, ధ్రువనచ్చత్రం, వనంగముడి” వంటి చిత్రాలలో నటిస్తున్నారామె. మరి తెలుగులో ఏ సినిమాతో సిమ్రాన్ మళ్ళీ మనవాళ్ళను పలకరిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!