లావణ్య త్రిపాఠీ, సత్య, నరేష్ అగస్త్య, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘హ్యాపీ బర్త్ డే’. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిరంజీవి (చెర్రీ), హేమలతా పెదమల్లు నిర్మాణ బాధ్యతలు వహిస్తుండగా… నవీన్ యేర్నేని, వై రవిశంకర్ సమర్పిస్తున్నారు. ‘మత్తు వదలరా’ చిత్రంతో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రితేష్ రానా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. యాక్షన్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ‘హ్యాపీ బర్త్ డే’ సినిమాను జూలై 15న విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు గురువారం ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా తెలిపారు. అయితే… ఈ సినిమా విడుదలకు సరిగ్గా ఒక రోజు ముందు అంటే జూలై 14న రామ్ ద్విభాషా చిత్రం ‘ది వారియర్’ విడుదల కాబోతోంది. రామ్, కృతిశెట్టి జంటగా నటిస్తున్న ఆ సినిమాలో ఆది పినిశెట్టి ప్రతినాయకుడు కాగా తమిళ దర్శకుడు లింగుస్వామి దీనిని తెరకెక్కిస్తున్నాడు. మరి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ది వారియర్’తో పాటు రాబోతున్న లావణ్య త్రిపాఠి ‘బర్త్ డే పార్టీ’ ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.
Happy Birthday: ‘వారియర్’ను ఢీ కొట్టబోతున్న అందాల చిన్నది!

Hbd Lavanya Tripati