Site icon NTV Telugu

Lavanya Tripati: డిఫరెంట్ కామెడీతో ‘హ్యాపీ బర్త్ డే’: రితేష్ రానా

Lavanya Happy Birthday

Lavanya Happy Birthday

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్ర లో ‘మత్తువదలరా’ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన సర్రియల్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ‘హ్యాపీ బర్త్ డే’. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 8న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు రితేష్ రానా మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించిన తన భావాలను ఇలా పంచుకున్నారు. ”’మత్తువదలరా’ కోసం ఏర్పడిన టెక్నికల్ టీమ్ అంతా పదేళ్ళుగా ప్రయాణిస్తున్నాం. అదే టీమ్ వుంటే ఒక సౌకర్యం వుంటుంది. ఒకరిని ఒకరం అర్ధం చేసుకుంటాం. టీమ్ లో మంచి సింక్ ఉన్నపుడు బెస్ట్ అవుట్ పుట్ వస్తుందని నమ్ముతాను. ‘హ్యాపీ బర్త్ డే’ మూవీ గురించి చెప్పాలంటే… ప్రస్తుతం మన సమాజంలో గన్స్ లీగల్ కాదు. అందరి దగ్గర గన్స్ వుండటం కష్టం. అందుకే ఒక ఫేక్ వరల్డ్ క్రియేట్ చేద్దామనే ఆలోచన వచ్చింది. సర్రియల్ కామెడీ అనే జోనర్ వుంది. కానీ తెలుగులో ఇప్పటి వరకూ ఆ జోనర్ లో పెద్దగా సినిమాలు రాలేదు. ఖచ్చితంగా కొత్తగా వుంటుందనిపించింది. ఐతే ప్రేక్షకులకు ఎలాంటి సందేహాలు ఉండకుండా ఈ సినిమా జోనర్ గురించి ప్రొమోషనల్ మెటిరియల్ లో ముందే వివరంగా చెప్పాం. కథ మొత్తం లాజికల్ గానే వుంటుంది. అయితే కథ జరిగే ప్రపంచం ఊహజనితంగా వుంటుంది” అని అన్నారు.

ఇందులో లీడ్ రోల్ కు లావణ్య త్రిపాఠిని ఎంపిక చేసుకోవడం గురించి రితేష్ చెబుతూ, ”లావణ్య త్రిపాఠి గతంలో ఇలాంటి సినిమా చేయలేదు. ఆమె బయట చాలా జోవియల్ గా వుంటారు. ఒక టీవీ షో లో తనని చూసి ఈ క్యారెక్టర్ రాశాను. ఈ పాత్ర ఆమెకు కొత్తగా వుండటంతో పాటు సరిగ్గా నప్పింది. ఈ కథని లావణ్య త్రిపాఠి లీడ్ చేస్తారు. మిగతా పాత్రలన్నీ ముఖ్యమే. ఈ మూవీ థియేటర్ ఎక్స్ పిరియన్స్ కి బావుంటాయి. 300 వందల మంది కలసి నవ్వుకోవడంలో ఓ కిక్ వుంటుంది. ఇలాంటి సినిమాలకు మ్యూజిక్ ప్రధానం. కాలభైవర డబుల్ క్రేజీ గా మ్యూజిక్ ఇచ్చారు. ఇక టైటిల్ జస్టిఫికేషన్ గురించి చెప్పాలంటే… ఇందులో లావణ్య త్రిపాఠి పేరు హ్యాపీ. ఆమె బర్త్ డే రోజు కథలో కీలక అంశాలు జరుగుతాయి. కాబట్టి ‘హ్యాపీ బర్త్ డే’ అని పెట్టాం” అని తెలిపారు.

Exit mobile version