NTV Telugu Site icon

Hanuman: శ్రీ రామధూత స్తోత్రం పూనకాలు తెప్పించేలా ఉంది…

Hanuman

Hanuman

ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జా హీరోగా చిన్న సినిమాగా  స్టార్ట్ అయిన హనుమాన్ ఈరోజు పాన్ ఇండియా క్రేజ్ ని సొంతం చేసుకుంది. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ హనుమాన్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. పోస్టర్స్, టీజర్, ట్రైలర్ తో ప్రమోషన్స్ లో జోష్ తెచ్చిన హనుమాన్ మూవీ… ఇప్పుడు ఒక మాస్టర్ పీస్ ని బయటకి వదిలింది. “శ్రీ రామధూత స్తోత్రం” అంటూ ఒక సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. ఈ సాంగ్ లో హనుమాన్ స్త్రోత్రం, లిరికల్ వీడియో డిజైన్ చేసిన విధానం సూపర్బ్ గా ఉంది. ప్రశాంత్ వర్మ నిజంగానే గ్రాఫిక్స్ కి కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తున్నాడు. హనుమాన్ నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్స్ అన్నీ ఒకెత్తు ఈ ఒక్క సాంగ్ ఒకెత్తు అనే చెప్పాలి.

శ్రీ రామధూత స్తోత్రం సాంగ్ తో హనుమాన్ సాంగ్ రాబోయే కాలంలో బయట చాలా ఎక్కువగా వినిపించే అవకాశం ఉంది. సింగర్స్ శ్రీ చరణ్, లోకేశ్వర్, హర్ష వర్ధన్ ఓకల్స్ అద్భుతంగా ఉన్నాయి. గూస్ బంప్స్ అనేది చాలా చిన్న పదం అనే చెప్పాలి. హనుమాన్ రిలీజ్ కి ఇంకా 9 రోజుల సమయం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో హనుమాన్ నుంచి ఇంకెలాంటి ప్రమోషనల్ కంటెంట్ బయటకి వస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే హనుమాన్ సినిమాలో కోటి క్యారెక్టర్ కి మాస్ మహారాజా రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఇప్పటికే బయటకి వచ్చేసింది.