NTV Telugu Site icon

Hanuman: 300 కోట్లు నాట్ అవుట్…

Hanuman

Hanuman

సంక్రాంతి సినిమాల్లో హనుమాన్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 92 ఏళ్ళ తెలుగు సినిమా సంక్రాంతి బాక్సాఫీస్ చరిత్రలో హనుమాన్ సృష్టించిన రికార్డ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అండర్ డాగ్ గా రిలీజైన హనుమాన్ సినిమా స్టార్ హీరోలతో పోటీలో విన్నర్ గా ఎమర్జ్ అయ్యింది. డే వన్ నుంచే క్లీన్ హిట్‌ టాక్ సొంతం చేసుకున్న హనుమాన్ రిలీజై 25 రోజులు అయ్యింది. మొదటి వారంలో తక్కువ థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా… మూడో రోజు నుంచి థియేటర్స్ కౌంట్ పెంచుకోని సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టింది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా ఈ రేంజ్ హిట్ ఊహించి ఉండరు. అమలాపురం టు అమెరికా వరకు హనుమాన్ పై కాసుల వర్షం కురుస్తోంది.

ఓవరాల్ గా హనుమాన్ సినిమా ఇప్పటివరకు 300 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది. 300 కోట్లు అనే ఫిగర్ ని హనుమాన్ చిత్ర యునైట్ మాత్రమే కాదు ఇండస్ట్రీలో ఉన్న ఏ ఒక్కరు కలలో కూడా ఊహించి ఉండరు. అంతటి వండర్ కి చేసి చూపించింది హనుమాన్ సినిమా. వరల్డ్ వైడ్ 300 కోట్ల మార్క్ ని రీచ్ అయ్యింది హనుమాన్ మూవీ అంటూ మేకర్స్ నుంచి అఫీషియల్ పోస్టర్ బయటకి వచ్చేసింది. ఈ మధ్య కాలంలో ఇంత క్లీన్ హిట్ అండ్ కలెక్షన్స్ లో కాంట్రవర్సీలేని ఏకైక సినిమాగా హనుమాన్ నిలిచింది. తెలుగులో ఈగల్ సినిమా రిలీజయ్యే వరకు హనుమాన్ కలెక్షన్స్ బాగానే ఉంటాయి. ఈగల్ మూవీ హిట్ అయితే హనుమాన్ జోష్ కాస్త తగ్గుతుంది కానీ హనుమాన్ తేడా కొడితే మాత్రం హనుమాన్ సినిమాకి మరింత లాంగ్ రన్ దొరికేసినట్లే. మరి లాంగ్ రన్‌లో హనుమాన్ క్లోజింగ్ కలెక్షన్స్ రే రేంజులో ఉంటాయి? ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది చూడాలి.