చిన్నా సినిమా పెద్ద సినిమా అనే తేడా ఇకపై కనిపించదేమో… కార్తికేయ 2, 2018, కాంతార లాంటి సినిమాలు రీజనల్ బౌండరీస్ దాటి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసాయి. చిన్న సినిమాలుగా మొదలై పాన్ ఇండియా హిట్స్ గా నిలిచిన ఈ సినిమాల లిస్టులో ఇప్పుడు హనుమాన్ సినిమా కూడా జాయిన్ అయ్యింది. ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ ఈరోజు ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఒక రోజు ముందు నుంచే ప్రీమియర్స్ పడిపోవడంతో హనుమాన్ సినిమా మౌత్ టాక్ రిలీజ్ కన్నా ముందే బయటకి వచ్చేసింది. సెన్సేషనల్ హిట్, నార్త్ బెల్ట్ లో రచ్చ చేస్తది, టెర్రిఫిక్ విజువల్స్, అంత తక్కువ బడ్జట్ లో ఇలాంటి విజువల్స్ ఎలా అంటూ ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు.
హనుమాన్ రిలీజ్ కి ముందు మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్ హీరోలు బాక్సాఫీస్ బరిలో ఉండడంతో థియేటర్స్ దొరకడం కూడా కష్టం అయ్యింది. ముఖ్యంగా గత వారం రోజులుగా హనుమాన్ సినిమా థియేటర్స్ ఇష్యూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. సినిమా వాయిదా వేసుకోకుండా స్ట్రాంగ్ గా నిలబడిన మేకర్స్ అందుకు తగ్గ రిజల్ట్ ని ఈరోజు అందుకున్నారు. యునానిమస్ గా హిట్ టాక్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి హనుమాన్ సినిమా ఇకపై థియేటర్స్ లెక్కని పూర్తిగా మార్చేయడం గ్యారెంటీ. హనుమాన్ సినిమా హిట్ అనే మాట సాలిడ్ గా వినిపిస్తున్న టైమ్ లో “జై హనుమాన్” మరింత సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 2025లో హనుమాన్ సినిమాకి సీక్వెల్ గా జై హనుమాన్ రానుంది అని హనుమాన్ మూవీ ఎండ్ లో రివీల్ చేసాడు ప్రశాంత్ వర్మ.