Site icon NTV Telugu

Hanuman: ‘హనుమాన్ దెబ్బ’ కేజీఎఫ్, కాంతార రికార్డులు అబ్బా.. పుష్పతో సమానంగా కలెక్షన్స్

Hanuman

Hanuman

HanuMan first 3-day Collections total is Higher than KGF first part Kantara at par with Pushpa: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మొట్టమొదటి సినిమా హనుమాన్. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా నార్త్ సర్కిల్స్ లో ఈ సినిమా సంచలన వసూళ్లు రాబడుతూ ముందుకు దూసుకువెళుతోంది. ఇక బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్, సినీ క్రిటిక్ అయిన తరణ్ ఆదర్శ్ ఈ సినిమా ఒక సరికొత్త రికార్డు నమోదు చేసిందంటూ ట్వీట్ చేశారు. హనుమాన్ మొదటి మూడు రోజుల ఓపెనింగ్స్ పరిశీలిస్తే కేజిఎఫ్ మొదటి పార్ట్ అలాగే కాంతార వసూళ్ల కంటే ఎక్కువగా ఉన్నాయని దాదాపు పుష్ప సినిమాతో సమానంగా ఈ సినిమా నార్త్ లో వసూళ్లు రాబడుతోందంటూ ట్వీట్ చేశారు. అంతే కాదు హనుమాన్ సినిమా 2024వ సంవత్సరానికి మొదటి హిట్ గా నిలిచిందని ఓపెనింగ్ వీకెండ్ అద్భుతంగా ఉండడంతో రాబోతున్న రోజుల్లో కూడా వసూళ్లు భారీగా నమోదు అయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.

Actor Prabhas: దెబ్బకు పేరు మార్చుకున్న ప్రభాస్.. అసలు నిజం ఇదా?

అంతేకాక హిందీ వసూళ్ల వివరాలు తెలియజేస్తూ శుక్రవారం నాడు రెండు కోట్ల 15 లక్షలు, శనివారం నాలుగు కోట్ల ఐదు లక్షలు, ఆదివారం ఆరు కోట్ల ఆరు లక్షలు కలిపి మొత్తం హిందీలో ఇప్పటివరకు 12 కోట్ల 26 లక్షల దాకా వసూలు చేసినట్లు వెల్లడించారు. ఇది కేవలం హిందీ వర్షన్ మాత్రమే అని వెల్లడించారు. ఇక నార్త్ ఇండియాలో రిలీజ్ అయిన తెలుగు వెర్షన్ కి శుక్రవారం 24 లక్షలు, శనివారం 40 లక్షల, ఆదివారం 45 లక్షలు, మొత్తం కలిపి కోటి 9 లక్షల రూపాయలు వసూలు అయిందని వెల్లడించారు. జనవరి 25వ తేదీ వరకు సాలిడ్ రిలీజ్ ఏదీ లేకపోవడంతో పాటు మాస్ సర్కిల్స్లో హనుమాన్ సినిమాకి వస్తున్న పాజిటివ్ మౌత్ టాక్ ఈ సినిమాకి బాగా ప్లస్ అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. హనుమాన్ మరిన్ని రికార్డులు బద్దలు కొడుతూ సంచలన వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉందని ఈ సందర్భంగా తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు.

Exit mobile version