Site icon NTV Telugu

Prashanth Varma: నేనూ మహేష్ బాబు అభిమానినే… నా సినిమా రిలీజ్ డేట్ ని ముందుగానే అనౌన్స్ చేశాను

Prashanth Varma

Prashanth Varma

2024 సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడూ లేనంత పోటీ ఉంది. మహేష్ బాబు గుంటూరు కారం, వెంకీ మామ సైంధవ్‌, కింగ్ నాగ్ నా సామిరంగ, మాస్ మహారాజ రవితేజ ఈగల్, డబ్బింగ్ సినిమాలు కెప్టెన్ మిల్లర్, రజినీకాంత్ లాల్ సలామ్, శివ కార్తికేయన్ అయలాన్, తేజ సజ్జ హనుమాన్… ఇన్ని సినిమాలకి థియేటర్స్ ఎక్కడ దొరుకుతాయి? లాస్ట్ కి ఎవరు తమ సినిమాని వాయిదా వేసుకుంటారు అనేది కాసేపు పక్కన పెడితే… జనవరి 12న గుంటూరు కారం సినిమాతో క్లాష్ కి రెడీ అయిన ప్రశాంత్ వర్మ… హనుమాన్ ట్రైలర్ లాంచ్ లో ఈ క్లాష్ గురించి క్లారిటీ ఇచ్చాడు.

తేజ సజ్జ హీరోగా హనుమాన్ సినిమాని డైరెక్ట్ చేస్తున్న ప్రశాంత్ వర్మ… “హనుమాన్ సినిమా రిలీజ్ డేట్ ని చాలా రోజుల ముందే అనౌన్స్ చేసాం. జనవరి 12న సినిమా వస్తుందని మేము చెప్పిన చాలా రోజుల తర్వాత మహేష్ బాబు గుంటూరు కారం సినిమా వస్తుందని చెప్పారు. మహేష్ బాబుకి నేను కూడా చాలా పెద్ద ఫ్యాన్. ఫస్ట్ డేనే హనుమాన్ తో పాటు గుంటూరు కారం సినిమా కూడా చూస్తాను. హిందీతో పాటు ఇతర భాషల్లో అగ్రిమెంట్స్ కంప్లీట్ అయిపోవడం వలన క్లాష్ తప్పట్లేదు. తెలుగులో మా సినిమా 400 థియేటర్స్ లో రిలీజ్ అయితే హిందీలో 1500 థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. హనుమాన్ సినిమా ఓపెనింగ్స్ కాస్త ఇక్కడ కాస్త స్లోగా స్టార్ట్ అయినా తప్పకుండా లాంగ్ రన్ ఉంటుంది. లాంగ్ రన్ లో హనుమాన్ సినిమా మంచి కలెక్షన్స్ ని రాబడుతుంద”ని ప్రశాంత్ వర్మ కాన్ఫిడెంట్ గా చెప్పాడు. మరి ట్రైలర్ తో మెప్పించిన ఈ దర్శకుడు జనవరి 12న థియేటర్స్ లో ఆడియన్స్ ని ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి.

Exit mobile version