NTV Telugu Site icon

Hanuman: ఆల్ టైమ్ టాప్ 10 మూవీస్ లిస్టులో చేరిపోయిన సూపర్ హీరో సినిమా

Hanuman

Hanuman

తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ హిస్టరీ ఇన్ మేకింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ ఇద్దరు కలిసి చేసిన హనుమాన్ మూవీ పాజిటివ్ మౌత్ టాక్ తో దూసుకుపోతోంది. టీజర్ రిలీజ్ నుంచే ఇండియన్ సూపర్ హీరో వస్తున్నాడు అనే మాటని ప్రమోట్ చేసిన మేకర్స్… లో బడ్జట్ తో కూడా సూపర్బ్ క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్ చూపించి పాన్ ఇండియా హిట్ కొట్టారు. యునానిమస్ పాజిటివ్ టాక్ రావడంతో హనుమాన్ సినిమా థియేటర్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. సంక్రాంతి సీజన్ అయిపోవడంతో హనుమాన్ సినిమా లాంగ్ రన్ ని స్టార్ట్ చేసింది. ఇకపై ఎన్ని రోజులు థియేటర్స్ లో ఉంటుంది? ఎంత రాబడుతుంది అనేది సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది. ఎందుకంటే హనుమాన్ సినిమా కలెక్ట్ చేస్తున్న ప్రతి రూపాయి ప్రాఫిట్స్ లోకే వెళ్లిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో ఇంత క్లీన్ హిట్ టాక్ ఏ సినిమాకి రాలేదు. నైజాం, ఆంధ్రా, సీడెడ్ అనే తేడా లేకుండా అన్ని సెంటర్స్ లో హనుమాన్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ని రాబడుతోంది.

ఇండియాలోనే కాదు మన ఇండియా సూపర్ హీరోకో నార్త్ అమెరికా కూడా జేజేలు కొడుతోంది. హనుమాన్ మూవీ నార్త్ అమెరికాలో 3.3 మిలియన్ మార్క్ ని రీచ్ అయ్యింది. ఆ సెంటర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన టాప్ 10 మూవీస్ లో హనుమాన్ చోటు దక్కించుకుంది. సాహూ, ఆదిపురుష్ లైఫ్ టైమ్ కలెక్షన్స్ ని అయిదు రోజుల్లోనే బ్రేక్ చేసిన హనుమాన్ మూవీ… నెక్స్ట్ 3.41 మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసిన భరత్ అనే నేను సినిమా టార్గెట్ గా ముందుకి వెళ్తుంది. ఒకవేళ హనుమాన్ మూవీ 3.5 మిలియన్ డాలర్స్ కి కలెక్ట్ చేస్తే మాత్రం రామ్ చరణ్ రంగస్థలం సినిమా రికార్డ్ కూడా బ్రేక్ అయిపోయినట్లే. మరో థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యే లోపు హనుమాన్ మూవీ ఎన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుంది? ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుంది అనేది చూడాలి.