Site icon NTV Telugu

SeethaRamam: రష్మిక అసలు హీరోయినే కాదు.. స్టార్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

Rashmika Mandanna

Rashmika Mandanna

నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెల్సిందే. ఇక ఈ మధ్యకాలంలో పాత్రకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ‘సీతారామం’ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్న విషయం విదితమే. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సీతారామం’. వైజయంతి మూవీస్ బ్యానర్ లో స్వప్న దత్ నిర్మిస్తుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ వీడియోస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం విదితమే. ఈ చిత్రంలో రష్మిక అఫ్రీన్ అనే కాశ్మీర్ ముస్లీం అమ్మాయి పాత్ర లో కనిపిస్తుందని మేకర్స్ తెలుపడంతో ఆమె సినిమ మొత్తానికి హీరోయిన్ అని పలు రకాల కథనాలు వినిపించాయి.

ఇక ఈ వార్తలపై డైరెక్టర్ హను రాఘవపూడి స్పందించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ “ఈ సినిమాలో రష్మిక అసలు హీరోయిన్ కాదు.. హీరో అనే చెప్పాలి. ఆమె పాత్ర చాలా అద్భుతంగా డిజైన్ చేశాం. అందుకు తగ్గట్లే రష్మిక కూడా ఈ పాత్ర కోసం చాలా కష్టపడింది. గ్రౌండ్ వర్క్ చేసింది. ఎన్నో వీడియోలు చూసి, ఫోటోలు కలెక్ట్ చేసి అఫ్రీన్ పాత్రలో ఒదిగిపోయింది. ఆమె నటన చూసి నేను ఆశ్చర్యపోయాను. కళ్ళతోనే ఎన్నో హావభావాలను పలికించగల హీరోయిన్ రష్మిక. అఫ్రీన్ పాత్ర కోసం ఎంతోమందిని చూసాం కానీ చివరకు రష్మిక సరైన ఎంపిక అని అబిప్రాయపడ్డాం.. మా అంచనాలు తప్పుకాలేదని ఆమె నటన చూశాక అర్థమైందని” చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. రష్మిక గురించి స్టార్ డైరెక్టర్ ఈ రేంజ్ లో పొగిడేస్తుంటే ఆ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version