తెలుగు పరిశ్రమ సెంటిమెంట్ కి పెద్ద పీట వేస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఎదో ఒక సెంటిమెంట్ ని నమ్ముతుంటారు. ఇలాంటి సెంటిమెంటల్ వాతావరణంలో ఓ దర్శకుడు తన నటీనటులు, సిబ్బందికి జ్యోతిష్యం చెబుతూ తన విద్యను ప్రదర్శిస్తున్నాడు. అతడెవరో కాదు ‘అందాల రాక్షసి’తో దర్శకుడుగా మారిన హను రాఘవపూడి. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ తో సినిమా తీస్తున్న ఇతగాడికి జ్యోతిష్యం బాగా పట్టిందట. తనను కలసిన నటీనటులకు, సన్నిహితులకు ముందుగా జ్యోతిష్యం చెబుతూ ప్రతిభను చాటుతున్నాడట. అంతే కాదు ఇతగాడు చేయి చూసి కూడా భవిష్యత్ చెబుతాడట. తన వద్ద ఎవరినైనా సహాయకులు గా నియమించుకోవడానికి కూడా జాతకాన్ని చూసే తీసుకుంటాడట. అయితే ఇలా ఎక్కువగా గ్రహాలు, మానవులపై వాటి ప్రభావాలను చూడటం కంటే సినిమాను బాగా తీయటంపై ఎక్కువ దృష్టి పెడితే హనును మళ్ళీ సక్సెస్ వరిస్తుందనే వారు లేకపోలేదు. శర్వానంద్ తో హను రాఘవపూడి తీసిన గత చిత్రం ‘పడి పడి లేచె మనసు’ బాక్సాఫీస్ వద్ద బాల్చీ తన్నేసింది. మరి జ్యోతిష్యాన్ని నమ్ముకున్న హనుకు గ్రహాలు అనుకూలించి రాబోయే దుల్కర్ సినిమా అయినా హిట్ అయి పేరు తెచ్చిపెడుతుందేమో చూద్దాం.
హనును గ్రహాలు అనుగ్రహించేనా!?
