NTV Telugu Site icon

Hanu-Man Hindi: హిందీ 50 కోట్ల క్లబ్ లోకి హనుమాన్.. ఆరవ సౌత్ ఇండియన్ హీరోగా తేజ రికార్డు

Hanu Man

Hanu Man

Hanu-Man Hindi Joins 50 Crore Club: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమా అనేక రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు వెళుతుంది. 2024 సంక్రాంతి సందర్భంగా చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా సం.క్రాంతి విన్నర్ గా నిలవడమే కాదు 92 ఏళ్ల సంక్రాంతి సినీ రికార్డులు అన్నింటినీ బద్దలు కొట్టింది. ఇక ఈ సినిమా తెలుగులో అనేక రికార్డులు బద్దులు కొట్టడమే కాదు దాదాపు 300 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టి ఇప్పుడు మరో ఆసక్తికరమైన మైలురాయి కూడా ఈ సినిమా దాటేసింది. అసలు విషయం ఏమిటంటే హనుమాన్ సినిమా హిందీలో 50 కోట్ల క్లబ్ లో జాయిన్ అయింది. హిందీలో 50 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టడం అనేది చాలా కఠినమైన విషయం.

Masooda : త్వరలో ‘మసూద’మూవీకి ప్రీక్వెల్.. వెల్లడించిన ప్రొడ్యూసర్..

కానీ సౌత్ నుంచి వెళ్లి అక్కడ 50 కోట్ల పైగా కలెక్ట్ చేసిన 11వ సౌత్ సినిమాగా హనుమాన్ నిలిచింది. ఇక సౌత్ నుంచి వెళ్లి 50 కోట్ల కలెక్షన్లు సాధించిన హీరోలలో ఆరవ హీరోగా తేజా నిలిచాడు. ఇప్పటి వరకు ప్రభాస్, అల్లు అర్జున్, యష్, రజనీకాంత్, రక్షిత్ శెట్టి వంటి వారికి మాత్రమే అక్కడ 50 కోట్లకు పైగా కలెక్షన్లో లభించాయి. కానీ ఇప్పుడు తేజకి మొదటి పాన్ ఇండియా అటెంప్ట్ తోనే 50 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ రావడం గమనార్హం. ఇప్పటికే ఈ సినిమా సీక్వెల్ జై హనుమాన్ కి సంబంధించిన పనులు మొదలయ్యాయి. అయితే ఈ సినిమాలో శ్రీరామ్, హనుమాన్ పాత్రలను ఎవరు పోషిస్తారో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. ప్రశాంత్ వర్మ ఆయా పాత్రల కోసం పలువురిని పరిశీలిస్తున్న క్రమంలో ఈ సినిమాను చాలా పెద్ద కాన్వాస్‌పై తెరకెక్కించడం ఖాయం అని చెప్పొచ్చు.

Show comments