Site icon NTV Telugu

Hansika: మూడు భాషల్లో ‘మై నేమ్‌ ఈజ్ శ్రుతి’!

Talented Actress Hansika Motwani New Movie My Name is Shruti Updates.

ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు రానటువంటి ఆర్గాన్ మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘మై నేమ్‌ ఈజ్ శ్రుతి’. ఇటీవల విడుదలైన టీజర్‌లో ‘చర్మం వలిచి బిజినెస్ చేస్తామంటున్నారు. ఏం చేయాలి వాళ్లను?’ అంటూ కథానాయిక హాన్సిక చెప్పే డైలాగ్‌తో చిత్రంపై క్యూరియాసిటీ పెరిగింది. హాన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ ఓంకార్ దర్శకుడు. లేడి ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. ఇటీవల తెలుగులో విడుదలైన టీజర్ చక్కని స్పందన వచ్చింది. శుక్రవారం ఈ చిత్రానికి సంబంధించిన హిందీ, తమిళ టీజర్‌లను విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ”తెలుగులో విడుదల చేసిన టీజర్‌కు వచ్చిన స్పందన అనూహ్యం. టీజర్ ఆద్యంతం ఆసక్తిగా వుండటంతో సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో, ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఆసక్తికరంగా దర్శకుడు మలిచాడు. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం” అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ”సినిమా చూస్తున్నంత సేపు, తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ… ముగింపు వరకు ఎవరూ ఊహించలేని ట్విస్ట్‌లతో వుంటుంది” అని అన్నారు. మురళీశర్మ, ‘ఆడుకలం’ నారాయణ్, జయప్రకాష్, ప్రవీణ్, సీవీఎల్ నరసింహారావు, కేదారి శంకర్, పూజా రామచంద్రన్ ఇందులో కీలక పాత్రలు పోషించారు.

Exit mobile version