Hansika Motwani: నా సినిమా సక్సెస్.. పడిన కష్టం మొత్తం మర్చిపోయా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hansika Motwani: బబ్లీ బ్యూటీ హన్సిక ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం మై నేమ్ ఈజ్ శృతి. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్ నిర్మించారు. స్కిన్ మాఫియా నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 17న థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర సక్సెస్‌ను పురస్కరించుకుని మేకర్స్ మంగళవారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు.
ఇక ఈ సక్సెస్ మీట్ లో హన్సిక మాట్లాడుతూ.. ” ఈ సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు, మొదటి నుండి సపోర్ట్ చేస్తూ వస్తున్న మీడియాకు థ్యాంక్యూ. ఈ సినిమా కోసం నిర్మాత, దర్శకుడు ఎంతగా కష్టపడ్డారో నాకు తెలుసు. ఇది జెన్యూన్ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్.. ఈ సినిమాకు వస్తున్న టాక్, రేటింగ్స్.. పడిన కష్టమంతా మరిచిపోయేలా చేశాయి. ఇటువంటి మంచి చిత్రాన్ని తీసిన దర్శకుడితో వర్క్ చేసినందుకు హ్యాపీగా ఉంది. అలాగే నిర్మాత చాలా స్వీట్ అండ్ గుడ్ పర్సన్. ఒక సక్సెస్ఫుల్ సినిమా తీయాలని ఆయన ఎంతో తాపత్రయపడ్డారు. దర్శకనిర్మాతల ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌కి ఆల్ ది బెస్ట్. మా అందరితో మరిన్ని బ్లాక్‌బస్టర్ చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను. సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్యూ” అని చెప్పుకొచ్చింది.
Also Read
ఇక డైరెక్టర్ శ్రీనివాస్ ఓంకార్ మాట్లాడుతూ.. ” సినిమా విడుదలకు ముందు మీడియాకు షో వేశాం. షో అనంతరం మీడియా సోదరులు మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. మరుసటి రోజు సినిమా విడుదలైన తర్వాత కూడా నేను అదే ఫీడ్‌బ్యాక్‌ని గమనించాను. ఒక కొత్త దర్శకుడిని.. కొత్త నిర్మాత నమ్మడం అనేది మాములు విషయం కాదు. ఈ మూవీతో ఓ మంచి నిర్మాత ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా కథ చెప్పే సమయంలో హన్సిక గారికి ఒక ప్రామిస్ చేశాను. తన బెస్ట్ 10 మూవీస్‌లో ఈ సినిమా ఉంటుందని చెప్పాను. ఈ రోజు ఈ సినిమాకు వస్తున్న రివ్యూలు, రేటింగ్‌లు చూస్తుంటే.. నేను నా ప్రామిస్‌ను నిలబెట్టుకున్నాననే అనుకుంటున్నాను. పేరేంట్స్ పిల్లలతో కలిసి తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ, మీడియాకు మరొక్కసారి థ్యాంక్స్ చెబుతున్నాను” అని తెలిపాడు.
తాజావార్తలు
-
Healthy Breakfast Recipe: రోజంతా ఎనర్జీగా ఉండాలంటే ఇదే బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్..! ప్రోటీన్ అధికంగా ఉండే శనగ చాట్ ఇలా ట్రై చేయండి..
-
RaviMohan : జయంరవి చెప్పిన మూడక్షరాల ఇడ్లి నటి ఆమేనా?
-
CNG Price Hike: రెండు రోజుల్లో రెండోసారి.. మళ్లీ పెరిగిన సీఎన్జీ ధరలు..
-
International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
-
Ajinkya Rahane: యాహూ మాకు రెండు పాయింట్లు వచ్చాయి.. కేకేఆర్ విజయంపై రహానే సంతోషం!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..