Site icon NTV Telugu

Hansika : వదినపై ‘దేశముదురు భామ’ 2 కోట్ల పరువునష్టం దావా

Hansika Motwani

Hansika Motwani

‘దేశముదురు’ భామగా గుర్తింపు తెచ్చుకున్న హన్సిక మోత్వానీ ప్రస్తుతం కుటుంబ వివాదంలో చిక్కుకున్నారు. గత కొంతకాలంగా తనపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టేందుకు ఆమె ఏకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. హన్సిక వదిన నాన్సీ జేమ్స్ (ముస్కాన్) గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా హన్సిక కుటుంబంపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు, హన్సిక కుటుంబ సభ్యులు తనను శారీరకంగా, మానసిక వేదనకు గురిచేశారని, తాను గృహహింసకు గురయ్యానంటూ ఆమె చేసిన పోస్ట్‌లు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ ఆరోపణలు హన్సిక వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని హీరోయిన్ వర్గం వాదిస్తోంది. తనపై మరియు తన కుటుంబంపై కావాలనే అసత్య ఆరోపణలు చేస్తూ, సమాజంలో తమ గౌరవానికి భంగం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ హన్సిక ముంబై సెషన్స్ కోర్టులో రూ. 2 కోట్ల పరువు నష్టం దావా వేశారు. కేవలం డబ్బు వసూలు చేసే ఉద్దేశంతోనే నాన్సీ ఇదంతా చేస్తోందని హన్సిక తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

Also Read :Samantha : ఈ రోజు నేను ఇంత ధైర్యంగా ఉన్నానంటే కారణం ఆయనే

ఈ కేసును విచారించిన ముంబై సెషన్స్ కోర్టు ప్రాథమిక ఆధారాలను పరిశీలించి కీలక ఆదేశాలు జారీ చేసింది. హన్సికకు వ్యతిరేకంగా ఎలాంటి పబ్లిక్ స్టేట్‌మెంట్స్ గానీ, ఆరోపణలు గానీ చేయకూడదని ముస్కాన్‌ను ఆదేశిస్తూ తాత్కాలిక స్టే విధించింది. ఇటీవలే భర్త సోహైల్ కతూరియాతో విడాకులు తీసుకున్న హన్సిక, వ్యక్తిగత జీవితంలో ఇప్పటికే అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆ బాధ నుండి కోలుకోకముందే, ఇప్పుడు సొంత కుటుంబంలోనే ఆస్తులు, ఇతర కారణాలతో గొడవలు మొదలై కోర్టు వరకు వెళ్లడం అభిమానులను విస్మయానికి గురిచేస్తోంది. అయితే ఇంటి గుట్టు ఇలా కోర్టు మెట్లు ఎక్కడం హన్సిక కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి మరి.

Exit mobile version