Hansika Motwani: హీరోయిన్లు.. గ్లామర్ ప్రపంచంలో ఎక్కువ రోజులు ఉండాలంటే.. తమ అందాన్ని కాపాడుకుంటూనే ఉండాలి. అందాన్ని బట్టే ఒక విలువ ఉంటుంది అనేది నమ్మదగ్గ విషయం. అందుకే హీరోయిన్లు అందం కోసం జిమ్ లు, యోగాలు, అవేవి కాకపోతే సర్జరీలు, ఇంజక్షన్స్ వాడుతూ ఉంటారు. ఇందులో నిజం ఎంత అనేది వారికి మాత్రమే తెలుసు. అందం కోసం కాకుండా చైల్డ్ ఆర్టిస్టులుగా ఉన్నవారిని ఇంజక్షన్స్ చేసి వయసు పెరిగేలా, తగ్గేలా చేస్తారు అని ఇండస్ట్రీలో ఒక పుకారు ఉంది. ఒకప్పుడు బేబీ షాలినికి ఇంజక్షన్స్ ఇచ్చి వయస్సు కనపడకుండా చేసారని రూమర్ ఉంది. ఇక కుర్ర బ్యూటీ హన్సికకు ఇంజక్షన్స్ ఇచ్చి త్వరగా వయస్సు పెరిగేలా చేసారంటూ వార్తలు వచ్చాయి. హన్సిక చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ గా మారిన విషయం తెల్సిందే. 8 ఏళ్ళ వయస్సులోనే ఆమె నటించడం మొదలుపెట్టింది. దీంతో అలా నటించడానికి హన్సిక తల్లిదండ్రులు ఆమెకు ఇంజక్షన్స్ ఇచ్చినట్లు అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి.
Tarakaratna: అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి..
ఇక తాజాగా ఈ వార్తలపై హన్సిక, ఆమె తల్లి స్పందించారు. హన్సిక వెడ్డింగ్ ను.. హన్సిక లవ్ షాదీ డ్రామా అనే పేరుతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఒక సిరీస్ లా స్ట్రీమింగ్ చేస్తున్న విషయం తెల్సిందే. అందులో ఈ విషయాన్ని వారు పంచుకున్నారు. “నేను 22 ఏళ్ళ వయస్సులో ఉన్నప్పుడు కొంతమంది నామీద చెత్త వార్తలు చెప్పుకొచ్చారు. నేను త్వరగా పెరగడానికి మా అమ్మ నాకు ఇంజక్షన్స్ ఇచ్చిందని చెప్పుకొచ్చారు. నా గురించి, నా కుటుంబం గురించి ఎన్నో రాసుకొచ్చారు. 8 ఏళ్లకే నేను నటిగా మారాను.. దానికి మా అమ్మ నాకు హార్మోనల్ ఇంజక్షన్స్ ఇచ్చి పెద్దదిగా మార్చిందని ఎలా అనుకుంటారు” అని ఎమోషనల్ అయ్యింది. ఇక హన్సిక అమ్మ ఈ విషయమై మాట్లాడుతూ.. ” ఈ వార్తే కనుక నిజం అయ్యి ఉంటే, నా కూతురుకు నేను ఇంజక్షన్స్ ఇచ్చి ఉంటే.. టాటా బిర్లా కన్నా ఎక్కువ ధనవంతురాలిని అయ్యేదాన్ని. మీరు కూడా ఆ ఇంజక్షన్స్ కావాలని మా ఇంటి ముందు క్యూ కట్టేవారు.. అసలు ఇలాంటి వార్తలు రాసేవారికి కామన్ సెన్స్ ఉంటుందా..” అంటూ అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
