Site icon NTV Telugu

Hansika : హన్సికకు కోర్టులో షాక్.. ఇలా జరిగిందేంటి..

Hansika

Hansika

Hansika : సీనియర్ హీరోయిన్ హన్సిక తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది ఈ బ్యూటీ. సోహెల్ ను ఆమె పెళ్లి చేసుకున్న టైమ్ లో చాలా రూమర్లు వచ్చాయి. తన క్లోజ్ ఫ్రెండ్ భర్తనే ఆమె పెళ్లి చేసుకుందని అన్నారు. సోహైల్ కు గతంలోనే పెళ్లి అయి విడాకులు కూడా అయ్యాయి. రీసెంట్ గా సోహైల్ తన ఇన్ స్టాలో వీరిద్దరి ఫొటోలు డిలీట్ చేయడంతో విడాకుల రూమర్లు బలంగా వినిపించాయి. వాటిపై హన్సిక పెద్దగా స్పందించలేదు. ఇప్పుడు ఆమెకు కోర్టులో మరో షాక్ తగిలింది. మనకు తెలిసిందే కదా.. హన్సిక తమ్ముడు ప్రశాంత్ 2020లో ముస్కాన్ ను పెళ్లి చేసుకున్నాడు.

Read Also : Devan : ఐస్ క్రీమ్ తిని చనిపోయిన నటుడి భార్య..

ముస్కాన్ టీవీ యాక్టర్. ముస్కాన్ తనను వేధిస్తున్నారంటూ ప్రశాంత్, హన్సిక, అత్త మీద కేసు పెట్టింది. ఆ కేసులో హన్సికకు, ఆమె తల్లికి గతంలోనే బెయిల్ వచ్చింది. అయితే తన మీద కేసును కొట్టేయాలంటూ బాంబే సెషన్స్ కోర్టులో హన్సిక క్వాష్ పిటిషన్ వేసింది. తాజాగా ఆ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. హన్సిక పిటిషన్ లో బలమైన కారణాలు ఏమీ లేవని తెలిపింది. దీంతో హన్సికకు చుక్కెదురు అయింది. ముస్కాన్, ప్రశాంత్ ప్రస్తుతం వేర్వేరుగానే ఉంటున్నారు. ముస్కాన్ వేసిన కేసు ఇంకా విచారణలో ఉంది. ఈ కేసు కొలిక్కి వస్తే మాత్రం హన్సికపై చర్యలు తప్పేలా లేవు. హన్సిక సౌత్ లో ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. వయసు పెరుగుతున్నా సరే వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది ఈ బ్యూటీ.

Read Also : Allu Arjun : బన్నీ చేసిన పని.. విజయ్ కు కెరీర్ ను మార్చేసిందంట..

Exit mobile version