Site icon NTV Telugu

Gymkhana Director : గంజాయితో దొరికిన జింఖానా డైరెక్టర్ అరెస్ట్..

Gymkhana

Gymkhana

Gymkhana Director : ఇద్దరు డైరెక్టర్లు గంజాయితో పట్టుబడ్డారు. మలయాళ ఇండస్ట్రీలో ఈ నడుమ డ్రగ్స్, గంజాయి వాడుతూ నటులు పట్టుబడుతున్నారు. ఈ ఘటనలు తరచూ జరుగుతున్నాయి. తాజాగా జింఖానా సినిమాతో మంచి హిట్ అందుకున్న దర్శకుడు ఖాలిద్ రెహమాన్ గంజాయి కేసులో ఇరుక్కున్నాడు. శనివారం రాత్రి కొచ్చి గోశ్రీ బ్రిడ్జి దగ్గర ఉన్న ఫ్లాట్ లో ఖాలిద్ తో పాటు మరో డైరెక్టర్ అష్రాఫ్ హంజా, షలీఫ్ మొహమ్మద్ అనే మరో వ్యక్తి గంజాయి తీసుకోవడానికి అన్నీ రెడీ చేసుకున్న టైమ్ లో పోలీసులు రైడ్ చేసి అరెస్ట్ చేశారు. వీరు రోజూ ఈ ఫ్లాట్ లో గంజాయి కొట్టడానికి వస్తున్నారనే పక్కా సమాచారంతో రైడ్ చేసి మరీ పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. 1.6 గ్రాముల హైబ్రిడ్ గంజాయితో వీరు పట్టడంతో మలయాళ ఇండస్ట్రీ షేక్ అవుతోంది.
Read Also : Nani : బాలీవుడ్ ను మనం కాపాడలేం.. నాని ఆసక్తికర కామెంట్స్

వీరే కాకుండా మలయాళ ఇండస్ట్రీలో చాలా మంది డ్రగ్స్, గంజాయి తీసుకుంటున్నట్టు సమాచారం అందుతోందని పోలీసులు చెప్పడం సంచలనం రేపుతోంది. ఈ ముగ్గురిని తెల్లవారు జామున రెండు గంటల టైమ్ లో పట్టుకున్నారు. బిజినెస్ పరంగా ఎక్కువగా మొత్తంలో వీరి దగ్గర దొరకలేదు. అందుకే వారిని బెయిల్ మీద విడుదల చేశారు. రీసెంట్ గా విడుదలైన ఆలప్పుజ జిమ్ఖానా, ఉండ, తల్లూమాల, అనురాగ కరికిన్ వెళ్ళం లాంటి సినిమాలను డైరెక్ట్ చేశారు ఖాలిద్. అలాగే అష్రఫ్ హంజా కూడా తమాషా, భీమ లాంటి సినిమాలను తీశాడు. రీసెంట్ గానే నటుడు షైన్ టామ్ చాకో డ్రగ్స్ తో పట్టుబడటం పెద్ద సంచలనం రేపింది. ఇప్పుడు ఈ గంజాయి కేసు. మలయాళ ఇండస్ట్రీ ఇలా వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది.

Exit mobile version