GV Prakash: ప్రభుత్వ జూనియర్ కళాశాల సాంగ్ రిలీజ్ చేసిన జీవి ప్రకాష్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కాలేజ్ ఫేస్ పూర్తిచేసుకుని వచ్చిన వారే ఉంటారు. కాలేజీలో ప్రేమలు ఎలా ఉంటాయో అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటి కాలేజ్ లవ్ స్టోరీ గా వచ్చి ఎన్నో సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి ఈ నేపథ్యంలోనే ఓ యదార్థ సంఘటనను తీసుకొని ఎంతో ఆసక్తికరంగా మలిచారు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. దీనికి ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే షూటింగ్ , పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు సిద్దమైన క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు పోస్టర్లు టీజర్ రిలీజ్ చేయగా అన్ని మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. మోస్ట్ హపెనింగ్ సింగర్ మంగ్లీ పాడిన డూడుం డుక్కుడుం సాంగ్ ను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ చేతులమీదుగా రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా సాంగ్ మొత్తం విన్న జీవి ప్రకాష్ కుమార్ అత్యద్భుతంగా ఉందని మేకర్స్ మీద ప్రశంసల వర్షం కురిపించారు. సాంగ్ మ్యూజికల్ గా చాలా బాగుందని క్లాసికల్ టచ్ ఇవ్వడం తనకు పర్సనల్‌గా బాగా నచ్చిందని జీవి ప్రకాష్ కుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక ఈ సాంగ్ బాగా నచ్చడంతో మిగతా సాంగ్స్ ఎలా ఉంటాయో అని ఆసక్తి పెరిగిందని ఆయన వెల్లడించారు. ఈ సినిమా ఖచ్చితంగా మ్యూజికల్ హిట్ అవుతుందని తాను బలంగా చెప్పగలనని జీవి ప్రకాష్ కుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Also Read
- Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
- Box Office Collection: కోలీవుడ్ కల కలగానే మిగిలిపోనుందా? ₹1000 కోట్ల టార్గెట్‌కు బ్రేక్ పడినట్లేనా..!
- Ramayana Record: ‘రామాయణ’ రికార్డుల జాతర.. ‘పుష్ప 2’, ‘ధురంధర్ 2’ను దాటేసి టాప్‌లోకి!
- Naga Chaitanya: నాగ చైతన్య ముందు పెద్ద టార్గెట్టే.. 300 కోట్లను దుల్లగొడితేనే..!
కార్తీక్ రోడ్రిగ్జ్ అందించిన బాణీలకు శ్రీ సాయి కిరణ్ అర్థవంతమైన లిరిక్స్ రాయగా వాటిని తనదైన శైలిలో శ్రోతలందరూ మళ్లీ మళ్లీ వినే విధంగా ఆలపించారు మంగ్లీ. ఈ సినిమా ఆడియో హక్కులను ఫాన్సీ రేటుకు టీ సిరీస్ తెలుగు సంస్థ దక్కించుకోగా సాంగ్ అదే యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేశారు. కాలేజ్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమాలో కాలేజీ జంట మధ్య డూడుం డుక్కుడుం అంటూ సాగుతున్న ఈ సాంగ్ అత్యంత ఆసక్తికరంగా ఉంది. టీనేజ్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ చిత్రంలో ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు కొవ్వూరి అరుణ సమర్పకురాలు కాగా భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాతగా వ్యవహరించారు. కార్తీక్ రోడ్రీగుజ్ స్వరాలను అందించగా కమ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించారు. శ్రీ సాయి కిరణ్ లిరిక్స్ రాశారు. నిఖిల్ సురేంద్రన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.
తాజావార్తలు
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Anirudh-Kavya Wedding: అనిరుధ్-కావ్య మారన్ పెళ్లికి వేళాయే.. వివాహం తేదీ, స్థలం, పూర్తి వివరాలు ఇవే..
-
Keesara SI: కీసర పీఎస్‌లో ఆగని లంచావతారాలు.. రూ.2 లక్షలతో ఏసీబీకి చిక్కిన ఎస్సై శ్రీనివాస్!
-
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం.!
-
Arjun Ram Meghwal: బీఎస్ఎఫ్ జవాన్లతో దీపావళి సంబరాలు.. కేంద్ర మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం!
ట్రెండింగ్
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్‌పై కన్ను.. గుజరాత్ టైటాన్స్‌ది పెద్ద ప్లానే!
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!