ట్యాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం గుర్తుందా శీతాకాలం. రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగశేఖర్ దర్శకత్వం వహిస్తుండగా చిన బాబు – ఎంఎస్ రెడ్డి సమర్పణలో భావన రవి – నాగశేఖర్ – రామారావు చింతపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కన్నడలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్ టైల్’ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. ఇక తాజాగా నేడు ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లో ప్రేమ మాయాజాలంతో నింపేశారు.
చిన్నతనం నుంచి ప్రేమ కోసం ఆరాటపడే ఒక కుర్రాడు.. కళ్ళకి నచ్చిన ప్రతీ అమ్మాయినీ తానే లైఫ్ పార్ట్నర్ అనుకునే దేవ్.. ప్రతి శీతాకాలంలోనూ ఒక అమ్మాయి ప్రేమలో పడతాడు.. అలా స్కూల్ డేస్ నుంచి య్వాన్న దశ వచ్చేవరకు నలుగురు అమ్మాయిల ప్రేమలో పడతాడు. ఇక స్టేజ్ కి వచాకా ఆ నలుగురి లో తన లైఫ్ పార్ట్ నర్ ఎవరు అనేది తేల్చుకోలేక సతమతమవుతుంటాడు. మరి వీరిలో దేవ్ ఎవరిని తన లైఫ్ పార్ట్నర్ గా ఎంచుకున్నాడనేది ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా కథాంశంగా తెలుస్తోంది. ట్రైలర్ మొత్తం చాలా ప్లజెంట్ గా కట్ చేశారు. ప్రేమ మాయాజాలాన్ని చూపించారు. ఇక కాళ భైరవసంగీతం వినసొంపుగా ఉంది. మొత్తానికి ట్రైలర్ తోనే ఈ సినిమాపై భారీ అంచనాలను రేకెత్తించారు. మరి ఈ చిత్రంతో సత్యదేవ్ మరో హిట్ ని అందుకుంటాడా..? లేదా ..? అనేది చూడాలి.
