NTV Telugu Site icon

Tollywood Box Office: సినిమాలు ఫుల్… కలెక్షన్లు నిల్…

Box Office Report

Box Office Report

Gurthunda Seethakalam Mukha Chitram Films Not Performed Well At BO: ఇండియాలో ‘అవతార్ 2’ మేనియా మొదలై పోయింది. డిసెంబర్ 16న విడుదల కానున్న ఈ సినిమాకు తొలి వారం బుకింగ్స్ క్లోజ్ అయిపోయాయి. టిక్కెట్స్ బ్లాక్ మార్కెట్ దందా మొదలైంది. ఇదిలా ఉంటే ఆ సినిమాకి పోటీగా రాకూడదని డిసెంబర్ 9నే ఏకంగా 15 సినిమాల వరకూ టాలీవుడ్ బాక్సాఫీస్ పై దాడి చేశాయి. ఇలా సినిమాలు ఫుల్ గా రిలీజ్ అయినా వాటికి కలెక్షన్లు మాత్రం నిల్.

Pataan: నిజం రంగు చూపిస్తున్న దీపిక పదుకొణే

ఇలా గత శుక్రవారం థియేటర్లకు క్యూ కట్టిన పలు చిన్న సినిమాల సంగతి ఏమిటో చూద్దాం. టాలీవుడ్ బాక్సాఫీస్ పై దాడి చేసిన సినిమాల్లో సత్యదేవ్ నటించిన రొమాంటిక్ డ్రామా ‘గుర్తుందా సీతాకాలం’, బ్రహ్మానందం, కలర్స్ స్వాతి, సముద్రఖని, శివాత్మిక, రాహుల్ విజయ్ నటించిన ‘పంచతంత్రం’, వివాస్ వశిష్ట, ప్రియా వడ్లమాని అయోషా ఖాన్, చైతన్యరావు ప్రధాన పాత్రల్లో నటించిన థ్రిల్లర్ ‘ముఖచిత్రం’, యష్ పూరి, సెఫ్టీ పటేల్ నటించిన ‘చెప్పాలని వుంది’, కన్నడ డబ్బింగ్ ‘విజయానంద్’, రంజిత్ సొమ్మి, సౌమ్యామీనన్ జంటగా నటించిన ‘లెహరాయి’ వంటి సినిమాలు సందడి చేశాయి. వీటిలో ‘గుర్తుందా సీతాకాలం’, అంథాలజీ ‘పంచతంత్రం’ మినహా మిగిలిన సినిమాల్లో తెలిసిన ముఖాలు ఏవీ లేదు. ఈ సినిమాలకు టాక్ సంగతి పక్కన పెడితే కనీస స్థాయిలో ఓపెనింగ్స్ కూడా లేవు.

Waltair Veerayya: మెగాస్టార్ సినిమాలో మాస్ మహారాజా లుక్ అవుట్

ఉన్న వాటిలో ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాకు మాత్రమే 30 శాతం ఓపెనింగ్స్ ఉన్నాయి. మిగిలిన సినిమాలు అన్నీ డిజాస్టర్ టాక్ తో కనీస సంఖ్యలో ప్రేక్షకులు లేకుండా పోయాయి. కొన్ని సినిమాల షోస్ కూడా రద్దు అయ్యాయి అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్ధం అవుతుంది. ఇలా ఉంటే థియేటర్ల లో డిజిటల్ ప్రింట్ ఖర్చులు పక్కన పెడితే కనీసం కరెంట్ ఖర్చులు కూడా వర్కవుట్ కావని థియేటర్ల వారు వాపోతున్నారు. దర్శకనిర్మాతలు వారి ఆవేదనను ఎప్పుడు అర్థం చేసుకుంటారో! ఏమో!