NTV Telugu Site icon

Naga Vamshi: థియేటర్స్ నాకు… సెలబ్రేషన్స్ మీకు… రాజమౌళి రికార్డులన్నీ టచ్ చేస్తాం

Naga Vamshi

Naga Vamshi

ఏ సినిమాకైనా డైరెక్టర్ హైప్ తెస్తాడు, హీరో హైప్ తెస్తాడు… లేదా ఈ ఇద్దరి కాంబినేషన్ హైప్ తెస్తుంది. ఈ మూడు కాకపోతే సినిమా ప్రమోషనల్ కంటెంట్ హైప్ తెస్తుంది. ఒక మంచి టీజర్, ట్రైలర్ ని కట్స్ చేసి రిలీజ్ చేస్తే సినిమాపై హైప్ పెరుగుతుంది. ఇది ప్రతి సినిమా విషయంలో జరిగేదే అయితే ఈ లెక్కల్ని పూర్తిగా మార్చేస్తూ గుంటూరు కారం సినిమాకి కేవలం తన మాటలతోనే ప్రమోషన్స్ లో వేడెక్కిస్తున్నాడు ప్రొడ్యూసర్ నాగ వంశీ. సాంగ్స్, గ్లిమ్ప్స్ కన్నా గుంటూరు కారం సినిమాకి ఎక్కువగా ప్రమోషన్స్ చేసింది నాగ వంశీ మాటలే. మేము రావట్లేదు అనుకుంటున్నారేమో, మేము వస్తున్నాం అంటూ రిలీజ్ డేట్ విషయంలో కాన్ఫిడెంట్ గా సమాధానం ఇచ్చిన నాగ వంశీ… పండక్కి సూపర్ స్టార్ సినిమా వస్తే ఆడియన్స్ ఫస్ట్ ప్రయారిటీ మా సినిమాకే ఉంటుంది అలాంటప్పుడు మేము ఎందుకు తగ్గాలి… గుంటూరు కారం సినిమాతో నెవర్ బిఫోర్ మహేష్ బాబుని చూస్తారు… ఇలా ప్రతి ప్రెస్ మీట్ లో గుంటూరు కారం సినిమాకి ఎలివేషన్స్ ఇస్తూ వచ్చాడు నాగ వంశీ.

లేటెస్ట్ గా గుంటూరు కారం థియేటర్స్ విషయంలో కొంతమంది అభిమానులు ఆందోళన చెందుతూ ఉంటే నాగ వంశీ బయటకి వచ్చి ఒక ఇంటర్వ్యూలో “దాదాపు అన్ని సెంటర్స్ లో రాజమౌళి గారి సినిమాల కలక్షన్స్ ని దగ్గరలో ఉంటాం. అల వైకుంఠపురములో సినిమాకి ఇలానే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ లో రాజమౌళి గారి సినిమా కలెక్షన్స్ స్థాయిలోనే గుంటూరు కారం కలెక్షన్స్ ఉంటాయని” తేల్చి చెప్పేసాడు. ఈ ఇంటర్వ్యూ క్లిప్ ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ… “మీకు మళ్లీ స్ట్రాంగ్ గా చెబుతున్నా… మేము అదే మాట మీద ఉన్నాము. గుంటూరు కారంకి రికార్డ్ రిలీజ్ ని రికార్డ్ నంబర్ ఆఫ్ థియేటర్ లో ఉంటుంది. రిలీజ్ మాకు వదిలేయండి, సెలబ్రేషన్ ఏ మాత్రం తగ్గకుండా చూసుకునే బాధ్యత మీది” అని నాగ వంశీ పోస్ట్ చేసాడు. ఒక ప్రొడ్యూసర్ నుంచి ఇంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇస్తే ఫ్యాన్స్ ని ఆపడం ఎవరి వలన కాదు సో జనవరి 12న గుంటూరు కారం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.