NTV Telugu Site icon

Guntur Kaaram: అప్పుడు సాటిలైట్… ఇప్పుడు ఓటీటీ… తేడా ఏముంది గురూజీ?

Guntur Kaaramn

Guntur Kaaramn

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్… పవన్ కళ్యాణ్ కి అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. అల్లు అర్జున్ కి ఆలా వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ ని కూడా త్రివిక్రమ్ ఇచ్చాడు. ఎన్టీఆర్ కి అరవింద సమేత లాంటి అప్పటి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు. నితిన్ కి కూడా కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చింది త్రివిక్రమే. ఇలా పని చేసిన ప్రతి హీరోకి అయితే కెరీర్ బిగ్గెస్ట్ హిట్ లేదా ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు త్రివిక్రమ్. మహేష్ బాబుకి మాత్రం త్రివిక్రమ్ బాకీ పెరుగుతూనే ఉంది. ఈ కాంబినేషన్ లో అతడు సినిమా క్లాసిక్ గా పేరు తెచ్చుకుంది కానీ థియేటర్స్ లో ఆడలేదు. రెండో సినిమా ఖలేజా పరిస్థితి కూడా దాదాపు ఇంతే. ఈ రెండు సినిమాలు థియేటర్స్ లో ప్రేక్షకులని మెప్పించలేదు కానీ రెండు సినిమాల్లో మహేష్ బాబు మస్త్ ఉంటాడు. మహేష్ బాబుని ఆడియన్స్ కూడా కొత్తగా చూసారు కాకపోతే అది థియేటర్స్ లో కాదు టీవీల్లో… అతడు, ఖలేజా సినిమాలు టీవీల్లో సూపర్ హిట్స్ గా నిలిచాయి.

ఈ రెండు సినిమాలు నిర్మాతలకి డబ్బులు తీసుకోని రాలేదు… మూడోసారైనా ఆ లెక్క సరి చేసి త్రివిక్రమ్ మహేష్ బాబుకి సాలిడ్ హిట్ ఇస్తాడు అనుకుంటే మళ్లీ మిస్ ఫైర్ అయ్యింది. ఈ కాంబినేషన్ లో 12 ఏళ్ల తర్వాత వచ్చిన గుంటూరు కారం సినిమా థియేటర్స్ లో సంక్రాంతి పండగ సీజన్ ఉన్నంతవరకూ బాగానే కలెక్షన్స్ ని రాబట్టింది కానీ అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అవ్వలేదు. దీంతో థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకున్న గుంటూరు కారం సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్ అయిన గుంటూరు కారం సినిమా టాప్ ట్రెండ్ అవుతోంది. గుంటూరు కారం సినిమాని ఓటీటీలో చూసి అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అతడు, ఖలేజా సినిమాల విషయంలో సాటిలైట్ లో జరిగిందే ఇప్పుడు గుంటూరు కారం విషయంలో ఓటీటీలో జరుగుతుంది. మహేష్ కి బాకీ పడుతూనే ఉన్న మాటల మాంత్రికుడు ఈ లెక్కని ఎప్పుడు సరి చేస్తాడో చూడాలి.

Show comments