Site icon NTV Telugu

Guntur Kaaram: ఎన్ని ట్రిప్పులు వేసాం అని కాదన్నయ్యా… సినిమా చెప్పిన టైమ్ కి రిలీజ్ చేస్తున్నామా లేదా?

Mahesh Babu

Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ ట్రిప్స్ ఎక్కువగా వేస్తున్నాడు, సినిమా షూటింగ్ డిలే అవుతుంది అంటూ ఎప్పుడులేనన్ని కామెంట్స్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. SSMB 28 ప్రాజెక్ట్ ని త్రివిక్రమ్ తో అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ కామెంట్స్ మరీ ఎక్కువగా స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత SSMB 28 కాస్త గుంటూరు కారం సినిమా అయ్యింది, జనవరి 12న రిలీజ్ డేట్ ని కూడా లాక్ చేసుకుంది. ఈ రిలీజ్ డేట్ లాక్ అయిన తర్వాత మహేష్ బాబు ఫ్యామిలీతో ఎప్పుడు ఫారిన్ ట్రిప్ వెళ్లినా… సోషల్ మీడియాలో షూటింగ్ ఆగిపోయింది అంటూ రచ్చ మొదలయ్యేది. ఒకానొక సమయంలో అసలు మహేష్ గుంటూరు కారం సినిమా ఆపేస్తాడేమో అనుకునే వరకూ వెళ్లారు సినీ అభిమానులు.

ఇది చాలదన్నట్లు పూజా హెగ్డే గుంటూరు కారం నుంచి తప్పుకోవడం, సాంగ్ లీక్ అవ్వడం, ఆర్ట్ డైరెక్టర్ ఛేంజ్ అవ్వడం… ఇలా బయటకి వచ్చిన ప్రతి వార్త గుంటూరు కారం సినిమాని ఇరకాటంలోనే పడేశాయి. అయితే ఎవరు ఏమనుకున్నా తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు మహేష్ బాబు అండ్ త్రివిక్రమ్. జనవరి 12 రిలీజ్ డేట్ టార్గెట్ మిస్ చేయకుండా జెట్ స్పీడ్ లో సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఇంకో వారం టాకీ పార్ట్ మాత్రమే పెండింగ్ ఉంది, ఆ తర్వాత సాంగ్స్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. సో పక్కా ప్లానింగ్ తో త్రివిక్రమ్ అనుకున్న టైమ్ కి గుంటూరు కారం సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేసి, రిలీజ్ డేట్ ని సినిమాని మహేష్ ఫ్యాన్స్ కి గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాడు.

Exit mobile version