Site icon NTV Telugu

Guntur Kaaram Bookings: ఓవర్సీస్ లో బాబుని బీట్ చేయడం కష్టం

Guntur Kaaram Bookings

Guntur Kaaram Bookings

గుంటూరు కారం షూటింగ్ కంప్లీట్ చేసి మహేష్ బాబు న్యూ ఇయర్ వెకేషన్ కోసం ఫారిన్ ఫ్లైట్ ఎక్కేశాడు. ఇక మాటల మాంత్రికుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే సగానికి పైగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయ్యిపోయాయట. మిగతా సగం కూడా త్వరగానే త్రివిక్రమ్ అండ్ టీం ఫినిష్ చేయనున్నారని తెలుస్తుంది. ప్రమోషన్స్ కూడా ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. జనవరి 6న ప్రీరిలీజ్ ఈవెంట్, ట్రైలర్ బయటకి వచ్చేస్తే గుంటూరు కారం సినిమాపైనే హైప్ స్కై హైలో ఉంటుంది. ఇలా గుంటూరు కారం సినిమాకి సంబంధించిన అన్ని పనులు సాఫీగా సాగిపోతున్నాయి. ఇక రిలీజ్‌కు మరో రెండు వారాలు మాత్రమే ఉంది, జనవరి 12న ఇండియాలోనే గుంటూరు కారం షోస్ పడుతుంటే ఓవర్సీస్ లో ప్రీమియర్స్ జనవరి 11 నుంచే పడనున్నాయి. దీంతో 12 రోజుల ముందే ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయిపోయాయి.

నార్త్ అమెరికాలో గుంటూరు కారం సినిమాని ప్రత్యంగిరా సినిమాస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. లియో, సలార్ సినిమాలని రిలీజ్ చేసిన ప్రత్యంగిరా… గుంటూరు కారం సినిమాకి కూడా లార్జ్ నంబర్ ఆఫ్ స్క్రీన్స్ ని బ్లాక్ చేస్తుంది. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వడంతో మహేష్ ఫ్యాన్స్ జోష్ లో ఉన్నారు. 12 రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో మంచి బజ్ చూపిస్తున్న గుంటూరు కారం ప్రీమియర్స్ పడే సమయానికి ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేయడం గ్యారెంటీ. మహేష్ బాబుకి ఓవర్సీస్ లో ఉన్న రికార్డ్ ఏ హీరోకి లేదు… మోస్ట్ నంబర్ ఆఫ్ వన్ మిలియన్ డాలర్ సినిమాలు ఉన్నది మహేష్ బాబు ఖాతాలోనే, 11 సినిమాలతో మహేష్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఇలాంటి హీరో చాలా కాలం తర్వాత క్లాస్ గా మాస్ జానర్ లో సినిమా చేస్తున్నాడు అంటే బాక్సాఫీస్ దగ్గర ఆల్రెడీ ఉన్న బెంచ్ మార్క్ కు బ్రేక్ అయ్యి కొత్త లెక్కలు పుట్టాల్సిందే.

Exit mobile version