NTV Telugu Site icon

Guntur Kaaram Song: ఫ్యాన్స్ తోనే కామెడీ… చేస్తే చేసాడు కానీ సాంగ్ రిలీజ్ టైమ్ చెప్పాడులే

Guntur Kaaram Song

Guntur Kaaram Song

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. హారిక హాసిని ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్నాడు. అతడు, ఖలేజా సినిమాల తర్వాత దాదాపు దశాబ్దం గ్యాప్ తీసుకోని త్రివిక్రమ్-మహేష్ బాబు కలిసి చేస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారం మూవీపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ ఎప్పటికప్పుడు ప్రమోషనల్ కంటెంట్ ని రిలీజ్ చేస్తూ సినిమాపై హైప్ పెంచుతూనే ఉన్నాడు ప్రొడ్యూసర్ నాగ వంశీ. టైటిల్ సాంగ్, మాస్ స్ట్రైక్ వీడియోలో గుంటూరు కారం సినిమాలోని ఘాటుని పరిచయం చేసాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో గుంటూరు కారం సినిమాలోని ప్రేమని పరిచయం చేస్తూ ‘ఓ మై బేబీ’ సాంగ్ బయటకి రానుంది.

ఈరోజు బయటకి రానున్న ఈ సాంగ్ బయటకి వచ్చే టైమ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఘట్టమనేని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సాంగ్ కోసం ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గుంటూరు కారం సినిమాని ట్రెండ్ చేస్తూ, సాంగ్ బయటకి వచ్చే టైమ్ చెప్పండి అంటూ మేకర్స్ ని ట్యాగ్ చేసి ట్వీట్స్ చేస్తున్నారు. దీంతో గుంటూరు కారం ‘X’ అఫీషియల్ అకౌంట్ నుంచి టైమ్ ఎమోజీతో రిప్లై ఇచ్చాడు అడ్మిన్. కంగారు పడకు, కంగారు పడకు అంటూ ఆల్మోస్ట్ ఈవెనింగ్ 5 గంటలకి ఓ మై బేబీ సాంగ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని ట్వీట్ చేసారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ జనవరి 12వరకూ ఇలానే యాక్టివ్ గా ఉంటూ సినిమాని ప్రమోట్ చేస్తూ ఉండమంటూ రిప్లై ఇస్తున్నారు. మరి సాంగ్ ని చెప్పినట్లుగానే సాయంత్రం 5కి రిలీజ్ చేస్తారా లేక వాయిదా వేస్తారా అనేది చూడాలి.