సంక్రాంతికి మొత్తం ఐదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో నాలుగు సినిమాలు మహేష్ బాబుతోనే పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా గుంటూరు కారం రిలీజ్ అవుతున్న రోజే హనుమాన్ వస్తోంది. ఈ సినిమా వల్ల గుంటూరు కారం ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ కనిపిస్తోంది కానీ సంక్రాంతి అంటేనే సినిమాల సీజన్ కాబట్టి… మహేష్ దెబ్బకు రీజనల్ లెవల్లో రికార్డులు లేవడం గ్యారెంటీ. ఇప్పటికే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో బాబు హవా స్టార్ట్ అయిపోయింది. అందుకు తగ్గట్టే… అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్. లేటెస్ట్‌గా ప్రొడ్యూసర్ నాగవంశీ ట్విట్టర్ స్పేస్‌లో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గుంటూరు కారం మూవీలో చివరి 45 నిమిషాలు మామూలుగా ఉండదని నాగవంశీ తెలిపాడు.
‘చివరి 45 నిమిషాలు అద్భుతంగా ఉంటుంది. మొత్తం ఫైట్ సీక్వెన్స్‌లు, ఎమోషన్స్, కుర్చీ మడతపెట్టి సాంగ్… ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తుంది. గుంటూరు కారంతో పెద్ద హిట్ కొట్టబోతున్నాం… థియేటర్ల సంగతి నేను చూసుకుంటాను.. సినిమాను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లే బాధ్యత అభిమానులదే’ అని చెప్పుకొచ్చాడు. అలాగే… ఇప్పటికే తమన్ ఫస్ట్ హాఫ్ బీజీఎమ్ రికార్డింగ్ కంప్లీట్ చేశాడు. ఓవరాల్‌గా జనవరి 12న గుంటూరు కారం మంచి ఐ ఫీస్ట్ అందిస్తుందని నాగవంశీ చెప్పుకొచ్చాడు. ఇక… ముందు నుంచి ప్రతి ఏరియాలో రాజమౌళి సినిమా నంబర్లకు దగ్గరగా వెళ్తున్నామని చెబుతునే ఉన్నాడు నాగవంశీ. ఈ లెక్కన గుంటూరు కారంపై మేకర్స్ ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే… ఈ సినిమా సాంగ్స్ విషయంలో కాస్త ట్రోలింగ్ జరుగుతోంది. దానికి సమాధానంగా జనవరి 6న గుంటూరు కారం ట్రైలర్ బయటికొస్తే.. లెక్కలన్నీ మారిపోతాయి. మరి గుంటూరు కారం ఎలా ఉంటుందో చూడాలి.
