NTV Telugu Site icon

Guntur Kaaram: 7 రోజుల్లో 212 కోట్లు… అతన్ని ఆపగలిగే ఫోర్స్ రీజనల్ బాక్సాఫీస్ దగ్గర లేదు

Guntur Kaaram

Guntur Kaaram

మహేష్ బాబు బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ అనే మాటని నిజం చేస్తూ… గుంటూరు కారం సినిమా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ ని రాబడుతోంది. మూడు రోజుల్లో 167 కోట్ల గ్రాస్ ని రాబట్టిన గుంటూరు కారం సినిమాని క్రిటిక్స్ నుంచి యావరేజ్ రివ్యూస్ వచ్చాయి. 70 వేల మంది గుంటూరు కారం సినిమాకి, సినిమా చూడకుండానే నెగటివ్ రివ్యూస్ ఇచ్చారు అనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది అంటే గుంటూరు కారం సినిమాపై ఎంత నెగటివిటీ స్ప్రెడ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ నెగిటివిటీని లెక్క చేయకుండా మహేష్ ఫ్యాన్స్ అండ్ న్యూట్రల్ ఫ్యామిలీ ఆడియన్స్ గుంటూరు కారం సినిమాని నిలబెడుతున్నారు. సంక్రాంతి పండగ రోజు కూడా గుంటూరు కారం సినిమాకి ఈవెనింగ్ అండ్ నైట్ షోస్ ఫుల్ అయ్యాయి.

ఫెస్టివల్ సీజన్ ని క్యాష్ చేసుకున్న గుంటూరు కారం సినిమా ఫస్ట్ వీక్ లో రీజనల్ బాక్సాఫీస్ దగ్గర నెవర్ బిఫోర్ రికార్డ్ ని క్రియేట్ చేస్తూ 212 కోట్ల గ్రాస్ రాబట్టిందని మేకర్స్ నుంచి అఫీషియల్ పోస్టర్ బయటకి వచ్చేసింది. 100 కోట్లకి పైగా షేర్ ని నెగటివ్ టాక్ తో రాబట్టడం అనేది అంత ఈజీ విషయం కాదు. మహేష్ ఫ్యాన్స్ స్ట్రాంగ్ గా నిలబడి గుంటూరు కారం సినిమాని బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు తీసుకోని వెళ్తున్నారు. ఇప్పటికే 85-90% బిజినెస్ రికవరీ చేసిన గుంటూరు కారం సినిమా మరో 20 కోట్లని కలెక్ట్ చేస్తే చాలు బ్రేక్ ఈవెన్ మార్క్ ని రీచ్ అయినట్లే. ఈరోజు నుంచి మళ్లీ వీకెండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి గుంటూరు కారం సినిమా మళ్లీ సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టడం గ్యారెంటీ. సో ఈ వీక్ ఎండ్ అయ్యే లోపు గుంటూరు కారం సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ ని చేరుకోనుంది.

Show comments