NTV Telugu Site icon

Gundeninda Gudi Gantalu: ‘స్టార్ మా’లో సరికొత్తగా “గుండె నిండా గుడిగంటలు” సీరియల్

Gundenida Gudi Gantalu

Gundenida Gudi Gantalu

Gundeninda Gudi Gantalu to Telecast in Star Maa: అమ్మ అంటే దైవం, అమ్మ మన కళ్ళ ముందు తిరిగే దేవత. అలాంటి అమ్మకు దూరమైన ఓ కొడుకు ఏమవుతాడు? అసలు ఎందుకు దూరమయ్యాడు? అనేదే “గుండె నిండా గుడిగంటలు” సీరియల్ కథ అంటున్నారు మేకర్స్. విలక్షణమైన కథలతో ఎప్పటికప్పుడు కొత్త సీరియల్స్ అందిస్తున్న స్టార్ మా ఈ సారి అమ్మ కథతో అలరించబోతోందని అధికారికంగా ప్రకటించింది. తెలుగు లోగిళ్ళలో తనదంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న స్టార్ మా ఇప్పుడు మరిన్ని భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని అలరించబోతోందని వెల్లడించింది. అమ్మ-కొడుకుల అనుబంధం ఎంత గొప్పదో ఈ కథ చెబుతుందని, కన్నీరు ఎంతగా తోడు నిలబడుతుందో ఈ పాత్రలు చెబుతాయని అంటున్నారు.

Disney+ Hotstar: పాస్‌వర్డ్ షేరింగ్‌కి హాట్‌స్టార్ గుడ్ బై.. షేర్ చేస్తే కఠిన చర్యలు..

ప్రేమను పంచడం అంటే ఎలా ఉంటుందో ఈ సీరియల్ సన్నివేశాలు చెబుతాయని, కఠినమైన మనసుని కరిగించే శక్తి ప్రేమకు మాత్రమే ఉంటుందని ఈ కథనం వివరిస్తుందని వెల్లడించారు. అక్టోబర్ 2 నుంచి రాత్రి 9 గంటలకు ఈ సీరియల్ ప్రారంభం కాబోతోందని అధికారికంగా ప్రకటించారు. దారితప్పిన జీవితాన్ని ఒక గాడిలో పెట్టాలనుకునే అమ్మాయి ప్రయత్నం, ఆ తల్లికి కొడుక్కి మధ్య దూరాన్ని తగ్గించాలనుకునే తాపత్రయం, తల్లీ కొడుకుల మధ్య అనూహ్యమైన సంఘటనలతో ఈ సీరియల్ పూర్తిగా కొత్త భావోద్వేగాల్ని అందించబోతోందని అంటున్నారు. ఒక పసివాడు తల్లి కోసం ఎంత ఆరాట పడ్డాడో, తల్లి ఒకసారి కనిపిస్తే బావుణ్ణు అని ఎంతగా కోరుకున్నాడో.. అతని తర్వాత జీవితం ఎలా గడిచిందో తెలియాలంటే “గుండె నిండా గుడిగంటలు” చూడాల్సిందే అంటున్నారు..