NTV Telugu Site icon

Gunasekhar: ఆ ఒక్క మాట చెప్పగానే.. మోహన్‌బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు

Gunasekhar On Mohanbabu

Gunasekhar On Mohanbabu

Gunasekhar Interesting Comments On Mohan Babu Over Durvasa Maharshi Role: సమంత టైటిల్ రోల్‌లో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ‘శాకుంతలం’ సినిమా.. ఈనెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా నిర్వహిస్తోంది. తాజా ఇంటర్వ్యూలో భాగంగా.. దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రంలో దుర్వాస మహర్షి పాత్ర పోషించిన కలెక్షన్ కింగ్ మోహన్‌బాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో రుద్రమదేవి ఆఫర్‌ని ఆయన రిజెక్ట్ చేశారని, కానీ ఈసారి దుర్వాస మహర్షి పాత్రకు సరిగ్గా సరిపోతారని ఆయన్నే తీసుకోవాలని ఫిక్సయ్యానని అన్నారు. తమ మధ్య జరిగిన ఒక ఫన్నీ సంభాషణ గురించి కూడా దర్శకుడు తెలియజేశాడు.

Vijay Sethupathi: పొలిటికల్ ఎంట్రీపై విజయ్ షాకింగ్ కామెంట్స్.. పెద్ద ట్విస్టే!

గుణశేఖర్ మాట్లాడుతూ.. ‘‘గతంలో ‘రుద్రమదేవి’ సినిమాలోని ఒక పాత్ర కోసం మోహన్‌బాబుని అడిగినప్పుడు, ఆయన సున్నితంగా ఆ అవకాశాన్ని తిరస్కరించారు. ఆయన్ను ఒప్పించేందుకు ప్రయత్నించినా ఒప్పుకోలేదు. కానీ.. శాకుంతలం కథ అనుకున్నప్పుడు ‘దుర్వాస మహర్షి’ పాత్ర కోసం మోహన్‌బాబు తప్ప ఇంకెవరూ గుర్తుకు రాలేదు. దీంతో ఆయన్ను వెంటనే సంప్రదించా. ఈ సారి మాత్రం నో చెప్పలేని పాత్రతో వచ్చానని ఆయనకు చెప్పా. ‘శాకుంతలంలో ఒక పాత్ర ఉంది, అది మీరు మాత్రమే చేయాలి. ఒకవేళ మీరు చేయనంటే, ఆ పాత్ర ఇంకెవరు చేస్తే బాగుంటుందే మీరే చెప్పండి’ అని మోహన్‌బాబుని అడిగాను. ఇంతకీ ఏమితా పాత్ర అని అడిగితే.. దుర్వాసుడి పాత్ర అని చెప్పాను. అప్పుడు ఆయన వెంటనే పెద్దగా నవ్వేసి.. ‘నేను కోపిష్టి అని నా దగ్గరకు వచ్చావా?’ అని అడిగారు. దుర్వాసునిలో కోపం ఒక్కటే గుణం కాదు.. సున్నిత మనస్కుడు కావడంతో పాటు ఆయనో గొప్ప మహర్షి అని నేను బదులిచ్చా. నాకు మీరే కరెక్ట్ అనిపించారని చెప్పా. దీంతో వెంటనే ఆ పాత్రని పోషించడానికి ఆయన ఒప్పుకున్నారు’ అని చెప్పుకొచ్చాడు.

Kane Williamson: గుజరాత్ టైటాన్స్‌కు షాక్.. ఐపీఎల్ నుంచి కేన్ ఔట్

Show comments