యంగ్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా, ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘లక్ష్య’.. కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. భారతదేశ ప్రాచీన విద్య ఆర్చెరీ నేపథ్యంతో ‘లక్ష్య’ సినిమా తెరకెక్కుతోంది. ఎగ్జయిటింగ్ ఎలిమెంట్స్ తో, ఎంటర్‌టైనింగ్ వేలో, ఎంగేజింగ్‌గా స్క్రిప్ట్ తో దీనిని తెరకెక్కించినట్టు దర్శకుడు ధీరేంద్ర సంతోష్ చెబుతున్నారు. ఇందులో రెండు వైవిధ్యమైన లుక్స్ తో నాగశౌర్య ఆకట్టుకోబోతున్నారని, రెండింటి మధ్య వేరియేషన్ చూపించడానికి ఆయన కష్టపడ్డ తీరు స్ఫూర్తిదాయకమ’ని దర్శకుడు చెబుతున్నారు.
ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడో పూర్తికాగా, తాజాగా విడుదల తేదికి సంబంధించి పోస్టర్ విడుదల చేశారు. అయితే ఆ పోస్టర్ లో పలు విడుదల తేదీలను చూపిస్తూ గెస్ చేయమంటున్నారు. త్వరలోనే ఓ తేదీని ప్రకటించనున్నారు. సోనాలి నారంగ్ సమర్పణలో ఈ మూవీని నారాయణదాస్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ల మీద ఇది తెరకెక్కుతోంది. వెర్సటైల్ యాక్టర్స్ జగపతి బాబు, సచిన్ కేడేకర్ ఇందులో కీలక పాత్రలు పోషించారు.
