NTV Telugu Site icon

Guahar Khan: రంజాన్ ఉపవాసంపై సింగర్ షాకింగ్ కామెంట్స్.. గౌహర్ కౌంటర్

Gauahar Khan Counter

Gauahar Khan Counter

Guahar Khan Gives Strong Counter To Justin Bieber Couple: సెలెబ్రిటీ స్టేటస్ వచ్చిందంటే చాలు.. ప్రపంచంలో ఎవరికీ లేనంత జ్ఞానం తమకే ఉందన్నట్టు కొందరు తెలివితక్కువగా వ్యవహరిస్తుంటారు. ఒపీనియన్ పేరిట.. నోటికొచ్చింది మాట్లాడేస్తారు. ఆయా విషయాలపై కనీస అవగాహన ఉండకపోయినా.. ఏదో తెలిసినట్టు మాట్లాడుతుంటారు. ఇప్పుడు పాప్ సింగర్ జస్టిన్ బీబర్, అతని భార్య హైలీ బీబర్ కూడా అలాంటి ‘తెలివి’ ప్రదర్శించారు. తామెప్పుడూ పెట్టని రంజాన్ ఉపవాసంపై కాస్త ఓవర్‌గా వాగేశారు. దీంతో.. బాలీవుడ్ మోడల్, నటి గౌహర్ ఖాన్ వారికి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది.

Raashi Khanna : ఆ విషయంలో షారూఖ్ ఖాన్‎ను దాటేసిన రాశీ ఖన్నా

హిజాబ్ మోడర్న్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన బీబర్ జంట.. రంజాన్ ఉపవాసంపై మాట్లాడారు. ఈ సందర్భంగా.. ‘‘మేమైతే ఎప్పుడూ ఉపవాసం ఉండలేదు. మన ఆలోచన శక్తి మెరుగుపడాలన్నా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలన్నా.. మన శరీరానికి పోషకాలు కావాలి. ఆ పోషకాలు అందాలంటే.. మన పౌష్టికాహారం తినాలి. అందుకే.. మేము ఉపవాసం ఉండాలనే ఆలోచన చేయం. అయినా.. ఇలా కడుపు మాడ్చుకుని ఉపవాసాలు చేయడమేంటో మాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇందులో సెన్స్ లేదని అనిపిస్తోంది. అంతగా అవసరమైతే.. టీవీ చూడటం, సెల్‌ఫోన్‌ వాడటం మానేయాలే తప్ప.. ఇలాంటి తిండి మానేయడం ఏంటి? మరీ తెలివి తక్కువ వాళ్లలా ఉన్నారనిపిస్తోంది’’ అంటూ చెప్పుకొచ్చారు.

Chennai Super Kings: దయచేసి అతడ్ని తొలగించండి.. అతని వల్లే అనర్థాలు

ఈ వీడియో చూసిన గౌహర్ ఖాన్.. తన ఇన్‌స్టా స్టోరీలో వారి వీడియో షేర్ చేసి, గట్టి కౌంటర్ ఇచ్చింది. ‘‘అసలు మీకేం తెలుసని రంజాన్ ఉపవాసం గురించి మాట్లాడుతున్నారు. ఆ ఉపవాసం వెనుక దాగి ఉన్న సైన్స్‌ గురించి, ఆరోగ్య ప్రయోజనాల గురించి కొంచెం అయినా అవగాహన ఉందా? ముందు అవి తెలుసుకోండి. మీకంటూ ఓ అభిప్రాయం ఉండటం తప్పు కాదు. కానీ.. ఆ అభిప్రాయాన్ని ఎలా ఎలా వ్యక్తీకరించాలనే తెలివి కూడా ఉంటే బాగుంటుంది’’ అంటూ ఆ ఇద్దరికి చురకలంటించింది. ఇకపోతే.. తాను తల్లి కాబోతున్నందుకు తాను ఉపవాసాలు ఉండటం లేదని, దాని బదులు పేదవారికి ఆహారం పంపిణీ చేయాలని అనుకుంటున్నానని గౌహర్ పేర్కొంది.

Show comments