Site icon NTV Telugu

GRT జ్యూవెల్లర్స్ యాడ్ లో మెరిసిన అందాల భామ త్రిష

అందాల భామ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందం, అభినయం కలబోసిన ముద్దుగుమ్మ ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెల్సిందే. ఇక అప్పుడప్పుడు ప్రకటనలలో కనిపిచ్న్హి మెప్పిస్తున్న త్రిష తాజాగా జిఆర్ టి జ్యూవెల్లర్స్ ప్రకటనలో కనిపించి మెప్పించింది. ఈ యాడ్ కి సంబంధించిన మేకింగ్ వీడియోను జిఆర్ టి జ్యూవెల్లర్స్ బృందం రిలీజ్ చేసింది. అందమైన నగలతో, ఇంకా అందంగా మెరిసిపోతూ కనిపించింది త్రిష… దీపావళి స్పెషల్ ఎడిషన్ తో త్రిష ముందుకు రానుంది అంటూ జిఆర్ టి జ్యూవెల్లర్స్ తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే ఈ యాడ్ విడుదల కానుంది. ఇకపోతే ప్రస్తుతం త్రిష మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంలో నటిస్తుంది.

Exit mobile version