Site icon NTV Telugu

Halagali : తెలుగులోకి గ్రేట్ హిస్టారికల్ మూవీ ‘హలగలి’

Dhanunjaya

Dhanunjaya

ట్యాలెంటెడ్ హీరో డాలీ ధనంజయ, సప్తమి గౌడ ప్రధాన పాత్రల్లో సుకేష్ నాయక్ దర్శకత్వంలో యార్లగడ్డ లక్ష్మీ శ్రీనివాస్ సమర్పణలో కళ్యాణ్ చక్రవర్తి ధూళిపల్ల నిర్మిస్తున్న హిస్టారికల్ ప్రాజెక్ట్ ‘హలగలి’. ఈ చిత్రం రెండు భాగాలుగా వస్తోంది. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీలో చిత్రీకరిస్తున్నారు. గ్రాండ్ గా జరిగిన ప్రెస్ మీట్ లో ఈ సినిమా గ్లింప్స్ ని లాంచ్ చేశారు మేకర్స్. ధనంజయ్‌ను కమాండింగ్ అవతార్‌ ప్రజెంట్ చేసిన గ్లింప్స్ గ్రేట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.

Also Read : Mega Star : చిరంజీవితో ముగిసిన టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్ భేటీ..

తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో హీరో డాలీ ధనంజయ మాట్లాడుతూ ‘తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు. హలగలి అన్ టోల్డ్ స్టోరీ. ఈ సినిమాలో పార్ట్ కావడం గర్వంగా భావిస్తున్నాను. హలగలి కర్ణాటకలో గ్రేట్ ఎమోషన్. నిర్మాతకళ్యాణ్, డైరెక్టర్ సుకేష్ చాలా ప్యాషన్ తో ఈ ప్రాజెక్టుని రూపొందిస్తున్నారు. కథ వినగానే ఈ ప్రాజెక్టులో పార్ట్ అవ్వాలి అనిపించింది. ఈ గ్లింప్స్ మీ అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. మరిన్ని క్రేజీ అప్డేట్స్ రాబోతున్నాయి. తప్పకుండా సినిమా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది. అందరి అంచనాలను అందుకుంటుంది. మీ అందరి సపోర్ట్ కి థాంక్యూ. తప్పకుండా ఈ సినిమా చాలా మంచి ప్రాజెక్ట్ అవుతుంది.

Also Read : JR NTR Fans : అనంతపురంలో ఉద్రిక్తత.. ధర్నాకు దిగిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్

హీరోయిన్ సప్తమి గౌడ మాట్లాడుతూ ‘ ఈ సినిమా చేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఇది చరిత్రలో చాలా ముఖ్యమైన చాప్టర్. త్వరలోనే నా క్యారెక్టర్ కి సంబంధించిన గ్లింప్స్ కూడా రిలీజ్ కాబోతోంది. చాలా మాస్ క్యారెక్టర్ చేశాను. ఇది మన నేల కథ. డైరెక్టర్ చాలా అద్భుతంగా రాశారు. చాలా బిగ్ స్కేల్ లో ఈ సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలో సెట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ధనుంజయ గారితో ఇది నా సెకండ్ ఫిల్మ్. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా తప్పకుండా మీ అందరిని అలరిస్తుంది

Exit mobile version