NTV Telugu Site icon

NBK : బెజవాడలో బాలయ్య.. నందమూరి అభిమానుల భారీ ర్యాలీ

Nbk

Nbk

తలసేమియా వ్యాధిగ్రస్తులకు బాసటగా ఈ రోజు సాయంత్రం విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్టు తరఫున టాలీవుడ్ సెన్సేషన్ తమన్ మ్యూజికల్ నైట్ జరగనుంది. అందుకు సంబందించి ఏర్పాట్లు పూర్తీ చేసారు నిర్వాహకులు. సాయంత్రం జరగబోయే ఈవెంట్ కు ప్రేక్షకులు భారీ ఎత్తున హాజరుకానున్నారు. కాగా ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు టాలీవుడ్ నటుడు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ  గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. పద్మభూషణ్ అందుకున్న తరువాత మొట్టమొదటిసారిగా విజయవాడకు బాలకృష్ణ వస్తున్ననేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు గన్నవరం ఎయిర్ పోర్టుకు భారీగా చేరుకున్నారు నందమూరి అభిమానులు.

Also Read : Nidhhi Agerwal : బ్యూటిఫుల్ మేకోవర్ తో నిధి అగర్వాల్ ‘కొల్లగొట్టినాదిరో’

కొద్దిసేపటి క్రితం గన్నవరం ఎయిర్ పోర్టుకు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ చేరుకున్నారు. సంగీత దర్శకుడు థమన్ తో కలిసి హైదరాబాదు నుంచీ విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ ‘ జైబాలయ్య అనే నినాదం ప్రపంచం అంతా మోగుతోంది. నా అభిమానులకు నాకు విడదీయలేని అనుబంధం.తాను ఇంకా కుర్రాడినే అని, తన తండ్రి శత జయంతి సందర్భంలో, ఇప్పుడు పద్మభూషణ్ రావడం ఆనందంగా ఉందన్నారు. ఇప్పుడు పద్మభూషణ్ రావడమే కరెక్ట్, కేంద్రానికి నా కృతజ్ఞతలు. మా నాన్నగారికి భారతరత్న ఇవ్వాలి ఇది అన్ని తరాల డిమాండ్ అని అన్నారు. అనంతరం బాలకృష్ణ రాక సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ స్వాగత ఏర్పాట్లలో భాగంగా 70 కార్లతో గన్నవరం నుండి హోటల్ వరకూ  ర్యాలీగా వెళ్లారు. బాలయ్య రాకతో గన్నవరం ఎయిర్పోర్ట్ ప్రాంగణం జై బాలయ్య నినాదాలతో హోరెత్తింది.