NTV Telugu Site icon

Gowthami: ‘అన్నీ మంచి శకునములే’ ప్రేక్షకులకు ఓ మంచి బహుమతి!

Gowthami

Gowthami

Anni manchi Sakunamule : టాలెంటెడ్ డైరెక్టర్ నందిని రెడ్డి… సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కించిన సినిమా ‘అన్నీ మంచి శకునములే’. ఈ నెల 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇందులో కీలక పాత్ర పోషించిన సీనియర్ హీరోయిన్ గౌతమి విలేకరుల సమావేశంలో మూవీ విశేషాలని పంచుకున్నారు.

ఇప్పటికీ షూటింగ్, సినిమాని ఎంజాయ్ చేయటం గురించి చెబుతూ, ”నటన ను నేను ఎంజాయ్ చేయగలుగుతున్నాను కాబట్టే ఇంకా చేయగలుగుతున్నాను. ఈ విషయంలో సంతోషపడుతున్నాను.. ఒక రకంగా గర్వపడుతున్నాను. సినిమా నా ఫస్ట్ లవ్ అనే అనొచ్చు. సినిమా అనేది ఎండ్ లెస్. నటిగా కాకుండా సినిమాకి సంబంధించిన చాలా విభాగాల్లో పని చేశాను. కానీ ఇప్పటికీ అదే ఎక్సయిట్ మెంట్. నేర్చుకోవడానికి చాలా వుంది. ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ ఇంకా ఆసక్తికరంగా వుంది. యంగ్ స్టర్స్ చాలా ఇంపాక్ట్ ఫుల్ సినిమాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఇందులో నా పాత్ర పేరు మీనాక్షి. చాలా లవ్లీ క్యారెక్టర్. ఒక డ్రీమ్ మదర్, వైఫ్, ఫ్రెండ్ ఎలా వుండాలని వుంటుందో మీనాక్షి పాత్ర అలా వుంటుంది. తను ఫ్యామిలీని అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తుంది. ఇందులో ముఖ్యంగా చెప్పాల్సింది.. నా కెరీర్ ప్రారంభంలో రాజేంద్రప్రసాద్ గారితో నటించాను. మళ్ళీ ఇప్పుడు అదే జోడిలో చేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆయన ఇప్పటికీ తను ఉండే సన్నివేశంపై, అందులో కనిపించే నటీనటులపై ఎంతో ప్రత్యేక శ్రద్ధ వహించడం నాకు చాలా ముచ్చటేసింది. నిజంగా అలాంటి అంకితభావం కావాలి. ఇందులో నరేష్, షావుకారు జానకీ గారు, ఊర్వశి గార్లతో నటించటం ఆనందాన్ని కలిగించింది. అంత మంది మంచి నటులని నందిని గారు, స్వప్న గారు ఎలా ఒక్క దగ్గరకు చేర్చారో నాకు తెలీదు కానీ నిజంగా అద్భుతం. ప్రేక్షకులకు మర్చిపోలేని బహుమతి” అని అన్నారు.

మహిళా దర్శకురాలు, నిర్మాత చిత్రం లో నటించటం గురించి చెబుతూ, ”నేను ఎప్పుడూ జెండర్ ని బట్టి ప్రతిభ, సామర్థ్యాన్ని జడ్జ్ చేయను. ఒక లక్ష్యం వుంటే దాని కోసం ఎవరైనా ప్రయత్నించాల్సిందే. ఈ విషయంలో అయితే అద్భుతమైన ప్రొడ్యూసర్, అద్భుతమైన డైరెక్టర్. నందిని రెడ్డి గోల్డెన్ హార్ట్ డైరెక్టర్. తను ఎప్పుడూ ప్రశాంతంగా వుంటుంది. స్వయం నియంత్రణ వున్న దర్శకురాలు. స్వప్నగారు విషయానికి వస్తే ఒక గొప్ప నిర్మాతకు ఉండాల్సిన లక్షణాలన్నీ తనలో కనిపించాయి. నేను ఎక్కడో చెన్నైలో వుంటే వెదికి పట్టుకొని మరి కథని ఆ పాత్రని చెప్పించారు. ఒక దర్శకుడి విజన్ కి తగ్గట్టు పని చేసి, వారికి ఏం సమకూర్చాలో తెలిసిన నిర్మాత. ప్రియాంక, స్వప్న ఇద్దరూ వండర్ ఫుల్ ప్రోడ్యుసర్స్. ఈ విషయంలో అశ్వినీదత్ గారికి నిజంగా హ్యాట్సప్. ఇద్దరు పిల్లల్ని ఎంతో చక్కగా ప్రోత్సహించి ఇంత గొప్ప స్థితికి తీసుకొచ్చారు” అని అన్నారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి చెబుతూ, ”బోయపాటి గారి సినిమా చేస్తున్నాను. అలాగే ఒక వెబ్ సిరీస్ పూర్తయింది. అలాగే మరో అమెజాన్ వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ వున్నాయి” అని అన్నారు.

Show comments