ఇండస్ట్రీ ఏదైనప్పటికి విడాకులు, బ్రెకప్ లు సెలబ్రెటిలకు కామన్. ఎంత త్వారగా కలిసిపోతారో అంతే త్వరగా విడిపోతారు. తాజాగా బాలీవుడ్ యాక్టర్ గోవిందా భార్య సునీత అహూజా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసాయి. గోవిందా, సునీత మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఈ జంట విడాకులు తీసుకుంటున్నారని వార్తలు చక్కర్లు కొట్టినా, కుటుంబ సభ్యులు ఆ వార్తలను ఖండించారు. “వీరిద్దరూ విడిపోవడం జరగదు” అని స్పష్టంగా చెప్పారు. అయితే తాజాగా సునీత ఇచ్చిన పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు మళ్లీ ఈ దంపతుల మధ్య దూరం పెరిగిందని సూచిస్తున్నాయి.
Also Read : Karan Johar : ఆ సంఘటన తర్వాత నేను క్రికెటర్లను పిలవడం ఆపేశా – కరణ్ జోహార్
సునీత మాట్లాడుతూ – “మనిషి చిన్నతనంలో తప్పులు చేయడం సహజమే. నేను కూడా చేశాను, గోవిందా కూడా చేశాడు. కానీ వయసు పెరిగిన తర్వాత కూడా అదే తప్పులు చేయడం కరెక్ట్ కాదు కదా? ఒక మనిషికి భార్య, పిల్లలు ఉన్నప్పుడు ఎందుకు అలాంటి తప్పులు చేస్తారు?” అని ప్రశ్నించారు. “నిజం చెప్పాలంటే, నా జీవితంలో గోవిందా నాతో కంటే తన హీరోయిన్లతోనే ఎక్కువ గడిపాడు. మొదట్లో నాకు ఏం తెలియదు. అన్నీ తెలిసే సరికి చాలా ఆలస్యమైంది. అప్పటికే జీవితం ముందుకెళ్ళిపోయింది” అని చెప్పుకొచ్చారు ఆమె మాటలు విని అభిమానులు షాక్ అయ్యారు.
ఇప్పటికే గోవిందా, సునీత మధ్య జరిగిన విభేదాలు బహిరంగ స్థాయికి చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొద్ది నెలలుగా వీరిద్దరూ కలిసి పబ్లిక్‌లో కనిపించకపోవడం కూడా ఆ రూమర్స్‌కు మరింత బలం చేకూరుస్తోంది. ఇక గోవిందా కామెడీ టైమింగ్, డాన్స్, స్టైల్‌తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నారు. కానీ వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న ఈ వివాదాలు ఇప్పుడు ఆయనను మరోసారి హాట్ టాపిక్‌గా మార్చేశాయి.
