యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ రావణ్ పాత్రలో నటిస్తున్నారు. లక్ష్మణుడుగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. అయితే హనుమంతుడు క్యారెక్టర్ ఎవరు చేయబోతున్నారనే చర్చలకు స్పష్టత రానున్నట్లుగా తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు హనుమంతుడి పాత్రలో మరాఠీ నటుడు దేవదత్ నాగే పేరు వినిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రకటన రానున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో సినిమా షూటింగ్ ముంబయిలో ప్రారంభమైంది. అక్కడ కొంతమేర షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. కరోనా వైరస్ రెండో వేవ్ తో వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా అతిత్వరలోనే షూటింగ్ పునప్రారంభం కానుంది.
‘ఆదిపురుష్’లో హనుమంతుడి పాత్ర ఆయనదే!
