NTV Telugu Site icon

‘సరిలేరు నీకెవ్వరు’ సీక్వెల్ కు సన్నాహాలు ?

Sarileru Neekevvaru sequel on cards?

సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చే ఏడాది దర్శకధీరుడు రాజమౌళితో కలిసి పని చేయనున్నారు. రాజమౌళికి బల్క్ డేట్స్ కేటాయించే ముందు 2, 3 ప్రాజెక్టులను పూర్తి చేయాలనుకుంటున్నాడట మహేష్ బాబు. ఇప్పటికే త్రివిక్రమ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘సర్కారు వారి పాట’ షూటింగ్ పూర్తయ్యాక త్రివిక్రమ్ ప్రాజెక్టు స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో ఓ క్రేజీ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ సీక్వెల్ కు సన్నాహాలు మొదలయ్యాయట. దర్శకుడు అనిల్ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వరు’ సీక్వెల్ స్క్రిప్ట్ రాసి, మహేష్ కి వివరించాడట. అయితే మహేష్ ఇంకా ఈ సీక్వెల్ కు సంబంధించి తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. కాగా అనిల్ రావిపూడి వరుస సీక్వెల్స్ తో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే ‘ఎఫ్-2’కు సీక్వెల్ గా ‘ఎఫ్-3’ తెరెక్కిస్తున్నాడు. మరోవైపు మాస్ మహారాజ రవితేజతో ‘రాజా ది గ్రేట్’ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ సీక్వెల్…!