NTV Telugu Site icon

ప్ర‌భాస్ ‘రాధేశ్యామ్’కు భారీ ఆఫ‌ర్!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తాజా చిత్రం రాధేశ్యామ్ ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌లో ఉంది. ఓ పాట‌తో పాటు సీనియ‌ర్ న‌టుడు కృష్ణంరాజుకు సంబంధించిన ఓ ఎపిసోడ్, అలానే కొంత ప్యాచ్ వ‌ర్క్ మిన‌హా పూర్త‌య్యింది. క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంగా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన చిత్ర బృందం ఎప్పుడెప్పుడు దీనిని పూర్తి చేసి, జ‌నం ముందుకు సినిమాను తీసుకువ‌ద్దామా అని ఎదురుచూస్తోంది. ఇదిలా ఉంటే… ఈ చిత్ర నిర్మాణంలో భాగ‌స్వామి అయిన టీ సీరిస్ కు ఓ ప్ర‌ముఖ ఓటీటీ కంపెనీ భారీ ఆఫ‌ర్ ను ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీగా విడుద‌ల కానున్న రాధేశ్యామ్కు దాదాపు రూ. 330 కోట్ల బ‌డ్జెట్ అయిన‌ట్టుగా ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. అయితే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఏకంగా రూ. 400 కోట్ల‌కు స‌ర్వ‌హ‌క్కులు ఇవ్వ‌మ‌ని నిర్మాణ సంస్థ‌ను కోరుతోంద‌ట‌. మ‌రి యూవీ క్రియేష‌న్స్ అధినేత‌లు, టీ సీరిస్ వ‌ర్గాలు ఈ ఆఫ‌ర్ గురించి ఆలోచ‌న చేస్తారా? లేక ఏరియా వైజ్ బిజినెస్ చేసి విడుద‌ల చేస్తారా అనేది వేచి చూడాలి. ఒక‌వేళ ఈ డీల్ క‌నుక‌గా ఓకే అయితే… ప్ర‌భాస్ న‌టిస్తున్న మిగిలిన పాన్ ఇండియా చిత్రాల వ్యాపారాల‌పైన కూడా ఈ ప్ర‌భావం ప‌డుతుంది. ఒకే సంస్థ‌కు విడుద‌ల హ‌క్కుల‌ను ఎంతో కొంత లాభానికి ఇచ్చేసి నిర్మాత‌లు ప్రీ రిలీజ్ స‌మ‌యానికే ప్ర‌శాంతంగా ఉండొచ్చు!