Site icon NTV Telugu

సెట్స్ పైకి పవన్-రానా హీరోయిన్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- రానా దగ్గుబాటి ప్రధాన పాత్రధారులుగా మలయాళీ సూపర్‌హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రం తెలుగులో రీమేక్ అవుతోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను రూపొందిస్తుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాస్తున్నారు. కాగా ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతున్న తరుణంలో.. కరోనా సెకండ్ వేవ్ ఈ స్పీడ్ కు బ్రేకులేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ తదుపరి షెడ్యూల్ కు రెడీ అవుతుంది. త్వరలోనే పవన్-రానా సెట్స్ పైకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే అందరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా కథానాయికల విషయంలో క్లారిటీ వచ్చే సమయం ఆసన్నమైంది. ఈ తాజా షెడ్యూల్ లో హీరోయిన్స్ కూడా జాయిన్ కాబోతున్నారని తెలుస్తోంది. హీరోయిన్లుగా నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ లు ఎంపికైనట్లు ప్రచారం జరుగుతున్న.. ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. నిత్యా మీనన్ పవన్ కళ్యాణ్ భార్య పాత్రను పోషిస్తుండగా ఐశ్వర్య రాజేష్ రానాకు పెయిర్ గా నటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

Also Read: ధనుష్ కు భారీ రెమ్యునరేషన్!

Exit mobile version