సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. ఇటీవలే సర్కారువారి పాట చిత్రంతో విజయం అందుకున్న మహేష్ వెంటనే త్రివిక్రమ్ సినిమాను పట్టాలెక్కించాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తీ చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ సినిమా తరువాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇక ఇటీవల రాజమౌళి తనకు నచ్చిన స్టోరీ లైన్ తో మహేష్ ను కలవడం, అందుకు మహేష్ కూడా లోకే చెప్పడం జరిగాయని, ప్రస్తుతం జక్కన ఆ స్టోరీని డెవలప్ చేసే పనిలో ఉన్నాడని వార్తలు గుప్పుమంటున్నాయి.
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కు సంబంధించి జక్కన్నకు, మహేష్ కండిషన్స్ పెడుతున్నాడట. ఆ కండిషన్స్ ఏ విషయంలో అంటే హీరోయిన్ల ఎంపిక విషయంలోనని సమాచారం. తమ సినిమాకు బాలీవుడ్ హీరోయిన్లను తీసుకోవద్దని టాలీవుడ్ హీరోయిన్లను తీసుకోవాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ చాలామంది బాలీవుడ్ ముద్దుగుమ్మలతో ఆడిపాడాడు. వారి తీరుకు మహేష్ విసిగిపోయి, ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని టాక్ నడుస్తోంది. అప్పుడెప్పుడో ‘టక్కరి దొంగ’ లో బిపాసా బసు నుంచి ఇటీవల భరత్ అనే నేను చిత్రంలో కియారా అద్వానీ వరకు మహేష్, బాలీవుడ్ భామలను ఎంకరేజ్ చేస్తూనే వచ్చాడు.
ఇకనుంచి వారి బదులు టాలీవుడ్ హీరోయిన్స్ ను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇకపోతే రాజమౌళి స్ట్రాటజీ ప్రకారం పాన్ ఇండియా లెవెల్ సినిమా కాబట్టి అన్ని భాషల అభిమానులను మెప్పించడానికి స్టార్ హీరోయిన్ లను తీసుకుంటాడు. మరి మహేష్ కండిషన్ తో రాజమౌళి ఈసారి ఆలోచిస్తాడా..? తన స్ట్రాటజీ మార్చుకుంటాడా..? అనేది చూడాలి.
