Site icon NTV Telugu

సినిమాలకు గుడ్ బై.. స్టార్ హీరోయిన్ కూతురు!

అలనాటి అందాల హీరోయిన్‌ రాధ కూతురే ‘కార్తీక నాయర్‌’.. 17 ఏళ్లకే ‘జోష్‌’ చిత్రం ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ. ఆ తర్వాత తమిళంలో ‘కో’ ( తెలుగులో రంగం) సినిమాతో అక్కడి ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవ్వడంతో యూత్‌లో కార్తీకకు మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది. ఆతరువాత మలయాళ, కన్నడ ఇండస్ట్రీలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అక్కడ ఆమెకు అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఆతర్వాత కార్తీకకు ఆఫర్లు తగ్గాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన ‘దమ్ము’, అల్లరి నరేష్​ ప్రధాన పాత్రలో నటించిన ‘బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి’చిత్రాల్లో కీలకపాత్ర పోషించిన ఆమె.. 2016లో విడుదలైన ‘వా డీల్‌’ తర్వాత తెరపై కనిపించలేదు. అయితే తాజాగా కార్తీక సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. కార్తీక సినిమాల్లో అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాకపోవడంతో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో తన వ్యాపార సంస్థను మరింత అభివృద్ధి చేయాలనే భావనలో కార్తీక సినిమాలను చేయకపోవచ్చు అనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది.

Exit mobile version