NTV Telugu Site icon

60 కోట్లతో బంగ్లా కొన్న సీనియర్ హీరో

Bollywood actor Ajay Devgn Buys 60 Crore Bungalow

బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గన్ ముంబైలో రూ.60 కోట్ల విలువైన ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేశారు. ఈ కొత్త బిల్డింగ్ ముంబైలోని జుహులో, అజయ్ నివసిస్తున్న ఇంటికి దగ్గరగా ఉంది. ప్రస్తుతం ‘శివశక్తి’ అనే ఇంట్లో అజయ్‌ తో పాటు భార్య కాజోల్, పిల్లలు న్యాసా, యుగ్ ఉంటారు. 590 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ కొత్త బంగ్లా అజయ్, కాజోల్ లకు బాగా నచ్చిందట. వీరిద్దరూ ఇల్లు కొనడం కోసం ఒక సంవత్సరం పాటు వెతికారట. చివరికి గత సంవత్సరం చివరలో ఈ ఇల్లు నచ్చేసిందట. దీంతో కపోల్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ మే 7న ఈ బంగ్లాను వీణా వీరేంద్ర దేవ్‌గన్, విశాల్ అలియాస్ అజయ్ దేవ్‌గన్ పేర్లకు బదిలీ చేసినట్లు చెబుతున్నారు. అజయ్ ప్రతినిధి ఈ వార్తలను ధృవీకరించారు. అయితే బంగ్లాను కొనడానికి వారు చేసిన ఖర్చును మాత్రం వెల్లడించలేదు. అయితే అజయ్ 60 కోట్లతో ఈ బంగ్లాను కొన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయం ప్రస్తుతం బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ కొత్త బంగ్లాతో కొనడంతో అజయ్ దేవ్‌గన్ అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్, ధర్మేంద్రకు నైబర్ గా మారాడు. అమితాబ్ ఇటీవలే అదే ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న 5184 ఎస్ఎఫ్టి అపార్ట్మెంట్ ను కొనుగోలు చేశాడు. అర్జున్ కపూర్ కూడా బాంద్రాలో 4 బిహెచ్‌కె స్కై విల్లాను కొనుగోలు చేశాడు. దీని విలువ సుమారు 23 కోట్లు.